అగ్నిధార న్యూస్ ,పెద్దపల్లి:
తెలంగాణ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అధికారికంగా మొట్టమొదటిసారి జరుపుతున్న వాల్మీకి మహర్షి జయంతిని పెద్దపల్లిమండల పరిషత్ కార్యాలయంలో పెద్దపల్లి ఎంపీపీ బండారి స్రవంతి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా వాల్మీకి ఈ ఫోటోకి ఎంపీపీ ఘనంగా పూలమాల వేశారు.
        MPP మాట్లాడుతూ,
“మనిషిలోని సత్ప్రవర్తన కు నిదర్శనంగా నిలిచి, సర్వలోకాలకు పూజనీయం, ఆచరణీయమైన, రామాయణ మహా కావ్యాన్ని రచించి ఆది కవి గా మారిన మహాజ్ఞాని శ్రీ వాల్మీకి మహర్షి అని” ఈ సందర్భంగా ఎంపీపీ కొనియాడారు. MPDO రాజు మాట్లాడుతూ  సంస్కృత భాషలో ఆదికవి యుగాలు నాలుగు ,రెండవదైన త్రేతాయుగం కాలం నాటి శ్రీరాముని చరితను రసరమ్యంగా లిఖించి రామాయణాన్ని మనకు అందించిన వారు మహర్షి వాల్మీకి అన్నారు . నేడు వాల్మీకి జయంతి సందర్భంగా కార్యక్రమంలో వారందరికీ శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ,AE PR మదన్  MPO సుదర్శన్ కార్యాలయ పర్యవేక్షకులు సేనా రెడ్డి అక్రం  హరికృష్ణ సబ్బితంసర్పంచ్ సదయ్య ఆఫీస్ సిబ్బంది ఖాజా అలీ వెంకటేష్, తదితరులు పాల్గొన్నారు.