పెద్దపల్లి మండలం లోని కొత్తపల్లి గ్రామానికి చెందిన సుమారు 15 నుంచి 20 మంది రైతులు నెల్లూరుకి సంబంధించిన వరుణ్ అగ్రిటెక్ NLR (నెల్లూరు)145 వరి సీడ్ 70 ఎకరాలలో వరి నాట్లు వేయడం జరిగింది మొదట బాగానే ఏపుగా పెరిగి పొట్ట దశకు రాగానే పిలకలు వచ్చినా వరి మొత్తం గొట్టాలు గొట్టాలుగా రావడంతో రైతులందరూ ఆందోళన చెందారు అప్పటికే ఎకరానికి 25 నుంచి 30 వేల వరకు పెట్టుబడి పెట్టి నష్టపోయామని విషయాన్ని గ్రహించారు వెంటనే వ్యవసాయ అధికారి దగ్గరికి వెళ్లి జరిగిన విషయం తెలియజేయడంతో వ్యవసాయ అధికారులు
సంబంధిత కంపెనీ అధికారులతో మాట్లాడారు ఈ క్రమంలో ఈరోజు ఉదయం 9 గంటలకు కంపెనీ ప్రతినిధులైన సూపర్వైజర్ మల్లేశం కొత్త పల్లి కి వచ్చి రైతులతో ఫీల్డ్ విజిట్ కి వెళ్లి జరిగినటువంటి నష్టాన్ని గ్రహించడం జరిగింది. తదనంతరం రైతులందరూ రైతు వేదిక వద్దకు రావడంతో ఒక దశలో ఉద్రిక్త
వాతావరణం నెలకొంది కంపెనీ ప్రతినిధులు మాట్లాడుతున్న సమయంలో రైతులందరూ ఒక్కసారిగా ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలో కంపెనీ సూపర్వైజర్ నీ రైతు వేదికలో నిర్బంధించారు విషయం తెలుసుకున్న కొత్తపల్లి గ్రామ పాలకవర్గం మరియు సర్పంచ్ సత్యం రైతు వేదిక వద్దకు చేరుకొని నిర్బంధంలో ఉన్న కంపెనీ సూపర్వైజర్ మల్లేశం ను విడిపించడం జరిగింది ఈ క్రమంలో సర్పంచ్ సత్యం మాట్లాడుతూ రైతులకు జరిగిన నష్టాన్ని కంపెనీ యాజమాన్యంతో మాట్లాడి వెంటనే నష్ట పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనియెడల రైతుల పక్షాన ఆందోళన చేపడతామని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో రైతులు సిరాలపు శ్రీనివాస్ సమ్మయ్య నాగరాజు రాజేశం సతీష్ రాజేందర్ చంద్రయ్య లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు
