అగ్నిధార స్పెషల్ రిపోర్ట్

■  ఆర్ అండ్ బి అధికారులు అనుమతులు పొందారా*

■  రోడ్లు ధ్వంసం అయితే ఎవరిది బాధ్యత*

■  దుమ్మురేపుతున్న చెరువులు*

*అనుమతి టైము మించిన ఆగని టిప్పర్లు*

■  నిబంధనలు అతిక్రమిస్తున్న మట్టి నిర్వాహకులు*
■  చెరువులో చక్రం తిప్పుతున్న చోటామోటా నాయకులు*

■  అధికారుల పర్యవేక్షణ కరువు ఆగని అక్రమ దందా*

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )

పెద్దపల్లి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏప్రిల్ 20వ తేదీన జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ జిల్లా ఉన్నత స్థాయి అధికారుల సమావేశం నిర్వహించారు జిల్లాలోని చెరువులలో పూడిక మట్టి తీయడానికి ప్రభుత్వ కొత్త నిబంధనలు విధివిధానాలపై ఆసమావేశంలో మాట్లాడుతూ… రిజిస్టర్డ్ ఇటుక బట్టి యజమానుల నుండి వారికి అవసరమైన మేరకు మట్టి తవ్వకాలకు నిబంధనల ప్రకారం దరఖాస్తు చేసుకున్నవారికి అనుమతులు మంజూరు అవుతాయని పేర్కొన్నారు. ఈ క్రమంలో పెద్దపల్లి జిల్లాలో మైనింగ్ శాఖ అధికారులకి ఇటుక బట్టి నిర్వాహకులు మట్టి కోసం అని 79( మైనింగ్ శాఖ రికార్డు ప్రకారం )దరఖాస్తులు చేసుకున్నారు. అనుమతులు పొందిన ఇటుక బట్టి యజమానులు నిబంధనలకు లోబడి మట్టి తవ్వకాలు చేపట్టాలి. ఇరిగేషన్, మైనింగ్, ఆర్ అండ్ బి, శాఖ అధికారుల అనుమతులు పొంది గ్రామ పంచాయతీ కార్యదర్శి పర్యవేక్షణలో మట్టి తవ్వకాలు చేపట్టాలి.కానీ నిబంధనలు నీళ్లకొదిలి ఇష్టారాజ్యంగా ప్రభుత్వ ఆదేశాలకు విరుద్ధంగా మట్టి తోడుతున్నారు. నిబంధనల ప్రకారం ఉదయం 6 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు మట్టి తవ్వకాలు చేపట్టాలి కానీ నిబంధనలు తుంగలో తొక్కి అడ్డు అదుపు లేకుండా ఉదయం నాలుగు గంటల నుండి సాయంత్రం 10 గంటల వరకు యదేచ్ఛగా అక్రమ మట్టి తవ్వకాలు చేపడుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. రోడ్లు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది…. అనుమతులకు మించి హెవీ లోడు టిప్పర్ లతో మట్టిని తరలిస్తున్న క్రమంలో రోడ్లు ధ్వంసం అయ్యే ప్రమాదం ఉంది.ఆర్ అండ్ బి అధికారుల అనుమతులు లేకుండానే రోడ్లపైన మట్టి టిప్పర్లు యదేచ్ఛగా తిరుగుతున్నాయి. జరుగుతున్న మాయ. ? జిల్లాలో కొన్ని చెరువులో జరుగుతున్న మాయ ఇటుక మట్టి కోసం దరఖాస్తు చేసుకున్న బట్టి యజమానులు ఉత్సవ విగ్రహాలుగా మాత్రమే ఉంటారు. పేరుకే మట్టి బట్టి యజమానులకు కానీ చక్రం తిప్పేది మాత్రం ఆయా గ్రామాలలోని చోటామోటా నాయకులు ప్రజా ప్రతినిధులే అంటే దరఖాస్తుదారుల పాత్ర శూన్యం. చక్రం తిప్పేది మొత్తం ప్రైవేటు వ్యక్తులే మట్టి తవ్వకాలు జరగాలన్న ఆగాలన్న వీరి చేతిలోనే ఉంటుంది. అధికారులు ఎవరూ వచ్చినా మాట్లాడేది మాత్రం చక్రం తిప్పే నాయకుడుతోనే బట్టి యజమానులు చేపట్టాల్సిన పనులన్నీ ఆ వ్యక్తులే చక్కపెడతారు… అనుమతులు… రిజిస్టర్డ్ బట్టి నిర్వాహకుల పేరుమీద ఉన్నప్పటికీ ప్రైవేటు వ్యక్తులు ( చోటామోటా నాయకులు ) పెట్టుబడులు పెట్టి చెరువు మట్టి నంతా ఒక దగ్గర డంపింగ్ చేసి అదే మట్టిని మళ్లీ ఇటుక బట్టి నిర్వాహకులకు కావలసినప్పుడు ఒక టిప్పర్ మట్టిని 2 వేల రూపాయల నుండి 3 రూపాయల వరకు తిరిగి అమ్ముతారు,అనే ప్రచారం జోరుగా ఉంది. అంటే మట్టి దందా ఏ స్థాయిలో జరుగుతుందో వింటేనే విస్మయాన్ని గురిచేసింది. అలాగే పొందిన అనుమతులకు మించి మట్టి రవాణా చేస్తున్నారు అనే ప్రచారం జరుగుతుంది. ఇది కాక ఆయా గ్రామాలలోని నాయకులను ,ప్రజా ప్రతినిధులను, ప్రశ్నించే గొంతుకలను, ప్రసన్నం చేసుకోవడానికి మందులు, విందులు ,పగిడి ల పంపిణీ లతో ఎర్ర చూపుతున్నారు అని ప్రజలు చర్చించుకుంటున్నారు. అదేవిధంగా మండలంలోని ఒక గ్రామ పంచాయతీ పాలకవర్గం సమావేశమై గ్రామంలో జరుగుతున్న మట్టి తవ్వకాలపై నిలదీద్దాం అనుకునే క్రమంలో చక్రం తిప్పే నాయకుడు పాలకవర్గాన్ని ప్రసన్నం చేసుకోవడం కొసమెరుపు.