■  కొత్తపల్లి చెరువు లో ఆగిన మట్టి తవ్వకాలు. 

■ మూడు గంటల తర్వాత ప్రారంభమైన తవ్వకాలు.

■  ఆ మూడు గంటలు ఎందుకు ఆపారు ?

■  వచ్చిన అధికారిని అడిగితే ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే ఆపివేశామన్నారు.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 14 మంది ఇటుక మట్టి నిర్వాహకులు చెరువు మట్టి బౌండరీలు  చేపట్టకుండానే మట్టి  తవ్వకాలు చేపడుతున్నారని మైనింగ్ అధికారి సాయి కృష్ణ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వచ్చి జరుగుతున్న పనులను నిలుపుదల చేశారు. సరిహద్దులు పెట్టేంత వరకు మట్టి తవ్వకాలు చేపట్టవద్దని అన్నారు.ఈ సందర్భంగా మట్టి నిర్వాహకులు వచ్చిన అధికారితో వాగ్వాదానికి దిగారు . సరిహద్దులు చూపాల్సిన   బాధ్యత సంబంధిత శాఖ అధికారులు అయినప్పటికీ  బౌండరీలు పిక్స్ చేయకుండా కావాలని ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. ఇట్టి విషయమై మైనింగ్ ఎడిని అగ్నిధార వివరణ కోరగా సరియైన సమాధానం చెప్పకుండా దాటవేశారు.