ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాం… మీ భద్రత మా బాధ్యత: ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ ఐపిఎస్*
అగ్నిధారన్యూస్( రామగుండం కమిషనరేట్ ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి లోని మంచిర్యాల జోన్ దేవాపూర్ పోలిస్ స్టేషను పరిదిలో ని మావోయిస్టు ప్రభావిత గ్రామం రొట్టెపల్లి గ్రామపంచాయతీ లోని పాత తిరుమల పూర్ లో దేవాపూర్ పోలీస్ ఆధ్వర్యంలో *పోలీస్ మీకోసం* కార్యక్రమం భాగంగా గ్రామ సభ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మంచిర్యాల్ జోన్ ఇంచార్జ్ డి సి పి అఖిల్ మహాజన్ ఐపిఎస్ ముఖ్య అతిథిగా హాజరై గ్రామంలోని ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్లి వారితో మాట్లాడడం జరిగింది. 40 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యంతో పాటు యువకులకు వాలీబాల్ కిట్లు అందచేశారు.
ఈసందర్బంగా ఇంచార్జ్ డిసిపి మాట్లాడుతూ….. గ్రామ ప్రజలతో మాట్లాడి ప్రస్తుత పరిస్తుతులను అడిగి తెలుసుకున్నారు. పోలీస్ అధికారులు మీతో ఏవిదంగా ఉంటున్నారు, గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయా, మావోయిస్టు లకు సంభందించి మరియు వారి కదలికలు ఈ ప్రాంతంలో ఉన్నాయా అని అడగడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రెసిడెన్సీయల్ స్కూల్,హాస్టల్ లను ఏర్పాటు చేయడం జరిగింది. వాటిని సద్వినియోగం చేసుకొని పిల్లలు తప్పనిసరిగా చదివించాలి అన్నారు. ఈ ప్రాంతం నుండి తక్కువ మంది చదుకోవడం జరుగుతుంది. తల్లితండ్రులు తప్పకుండ తమ పిల్లలను స్కూల్స్ కి పంపించాలి వారి బంగారు భవిష్యత్తుకు పునాది వేయాలి అని, ఏదైనా సమస్య ఉంటే స్థానిక ఎస్ఐ కి, పోలీస్ అధికారులకు చెప్పవచ్చు అన్నారు. గ్రామం లో ఎవరికైనా ఆరోగ్య, కంటి సమస్యలు ఉన్నట్లయితే లయన్స్ క్లబ్ వారి సహాయ సహకారంతో కంటి పరీక్షలు చేయించడం జరుగుతుంది అవసరమైతే కంటి సర్జరీలు కూడా చేపించడం జరుగుతుందన్నారు. పోలీసులు ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటారని, మీ భద్రత మా బాధ్యత అని వారికీ చెప్పడం జరిగింది. ఎవరైనా అనుమానస్పద వ్యక్తులు కనిపిస్తే, ఎలాంటి సమాచారం ఉన్న సంబందిత అధికారులకు చెప్పాలన్నారు . సంఘవిద్రోహక శక్తులకు సహకరించవద్దని యువత తమ భవిష్యత్తు నాశనం చేసుకోవద్దన్నారు అన్నారు. ప్రస్తుతం ప్రభుత్వం విడుదల చేసిన పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ ను సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి, బెల్లంపల్లి, మంచిర్యాల ప్రాంతం లలో ఉచిత కోచింగ్ క్యాంపు లు నిర్వహించడం జరుగుతుంది అని ఈ ప్రాంతం యువత స్థానిక ఎస్ఐ కి వివరాలు తెలిపితే ఉచిత కోచింగ్ కోసం పోలీస్ వారి సహకారం అందించడం జరుగుతుంది అని తెలిపారు. ఒకప్పుడు మావోయిస్టుల ప్రబావం వలన పోలిస్ ఉద్యొగం చెయ్యడానికి ముందుకు రాకపోవడం జరిగేది కాని ఇప్పుడు ఎజెన్సీ , మావోయిస్టు ప్రబావిత మారుమూల గ్రామాలనుండి యూత్ పోలిస్ ఉద్యొగం చేయలని పట్టుదలతొ రావడం జరుగుతుందన్నారు.
అనంతరం ప్రజలతో కలిసి అల్పాహారం చేయడం జరిగింది. ఇంచార్జ్ డీసీపీ చేతుల మీదుగా 40 మంది నిరుపేద కుటుంబాలకు దుప్పట్లు, ఒక్కొక్కరికి 20 కిలోల బియ్యంతో పాటు యువకులకు వాలీబాల్ కిట్లు, చిన్న పిల్లలకు స్కూల్ బుక్స్, నోట్స్ బుక్స్, పెన్స్ లను అందచేశారు.
ఈ కార్యక్రమంలో మందమర్రి సర్కిల్ ఇన్స్పెక్టర్ ప్రమోద్ రావు, దేవాపూర్ ఎస్ఐ విజేందర్, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

