నెల రోజులకే పగుళ్ళు చూపిన సైడ్ వాల్ 

■■■■■ అగ్నిధార స్పెషల్ రిపోర్ట్ ■■■■■

మిషన్ కాకతీయ పనుల్లో నాణ్యత లోపం

■  జరుగుతున్న  పనుల్లో నాణ్యత లోపం.

■  అధికారుల పర్యవేక్షణ కరువు నెలరోజుల్లోపే పగుళ్ళు చూపిన సైడు వాళ్లు.

 ■  కట్టడాలకు లోకల్ వాగు ఇసుక వాడారు అని ఆరోపణలు.

■  నాణ్యత లోపం ఉంటే  చర్యలు తీసుకుంటాం ఇరిగేషన్ శాఖ అధికారి రాజేందర్.

అగ్నిధారన్యూస్ ( పెద్దపెల్లిజిల్లా ) పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో 2018 సంవత్సరానికి  సంబంధించిన మిషన్ కాకతీయ పనులు బ్రాహ్మణ కుంటా మరమ్మతులకు 16 లక్షల పైచిలుకు రూపాయలతో అభివృద్ధి పనులు .2022 సంవత్సరములో చేపట్టారు. చేపట్టిన పనుల్లో నాణ్యత లోపం ఉన్నదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కుంట మత్తడికి ఇరువైపులా సైడ్ వాల్స్   నిర్మిస్తున్న పనులకు వాడుతున్న(  ఇసుక లోకల్ వాగు నల్ల ఇసుక వాడారని ఆరోపణలు ఉన్నాయి) అందులో  ఒకవైపు సైడ్ వాల్ నెలరోజుల్లోపే మధ్యలో పగుళ్ళు చూపడంతో నాణ్యత లోపం స్పష్టంగా తెలుస్తుంది. సంబంధిత శాఖ అధికారుల పర్యవేక్షణ కరువు….తో… కాంట్రాక్టర్ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ నాణ్యత లోపంతో కట్టడం నిర్వహిస్తున్నారని విమర్శలు ఉన్నాయి. జరుగుతున్న పనులపై అగ్నిధార ప్రశ్నించినపుడు సంబంధిత శాఖ అధికారి కట్టడంలో జరుగుతున్న నాణ్యతను పరిశీలించి నాణ్యత లోపం ఉన్నట్లే  చర్యలు తీసుకుంటామని తెలిపారు.