అగ్నిధారన్యూస్( సుల్తానాబాద్ )సుల్తానాబాద్ మండలం చిన్న బొంకూర్ గ్రామ సర్పంచ్ రాజు, మంగళవారం హైదరాబాద్ లోని నాంపల్లి పబ్లిక్ గార్డెన్ లో ఉద్యానవన శాఖ ట్రైనింగ్ సెంటర్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఉద్యానవన శాఖ కమిషనర్ & డైరెక్టర్ ఎల్ వెంకట్ రామ్ రెడ్డి ని కలిసి చిన్న బొంకూర్ గ్రామ పంచాయతీ అనుబంధ గ్రామం రెబ్బల్ దేవ్ పల్లిలో ఉన్నటువంటి తిరుమల ఆయిల్ పామ్ నర్సరీ కి సంబంధించిన మొక్కల పెంపకంపై నిర్లక్ష్యం వహిస్తూ నిర్వహణ సక్రమంగా లేదని ఫిర్యాదు చేశారు. నర్సరీ కి సంబంధించిన అధికారుల పైన ఫిర్యాదు చేశారు.నర్సరీ కి రోజు వారి కూలి కోసం వస్తున్న వారి పట్ల అమర్యాద చూపుతున్నారన్నారు. అదేవిధంగా నర్సరీ కి సంబంధించిన ఇతర విషయాల పైన కమిషనర్ కి వినతి పత్రం అందజేయడం జరిగింది అన్నారు . ఈ సందర్భంగా సర్పంచ్ రాజును కమిషనర్ శాలువాతో సత్కరించి ఆయిల్ పామ్ మేమెంటొ ఇచ్చారన్నారు.

