ఇళ్ల మధ్యనే ఉంటూ ఇష్టారాజ్యంగా తిరుగుతూ 14వ వార్డు లో పందులు స్వైర విహారం
ప్రజల అవస్థలు పట్టించుకోని అధికారులు
అగ్నిధార న్యూస్ (నస్పూర్)
నస్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని 14వ వార్డు లో పందులు స్వైర విహారం చేస్తున్నాయని, వాటిని అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. పందులు ఇష్టారాజ్యంగా తిరుగుతున్నా ఇండ్ల మధ్యలో ఉంటున్నాయని, అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒక పక్క కరోనా కారణంగా భయం భయంతో ఉంటున్నామని, దీనికితోడు పందులు స్వైర విహారం చేస్తూ చెత్తను బయటకు లాగేస్తున్నాయని, పందులతో కలరా, మెదడువాపు, విషజ్వరాలు వంటి రోగాల బారిన పడతామని తెలిపారు. పందుల నివారణ కోసం మున్సిపల్ అధికారులకు ఎన్ని సార్లు చెప్పిన స్పందించడం లేదని ఇప్పటికైనా.. అధికారులు స్పందించి పందులను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
