పోలీస్ అధికారులు, సిబ్బందికి కమిషనరేట్ ప్రజలకు, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు.
పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.( ఐజీ ).
అగ్నిధారన్యూస్ ( రామగుండంకమిషనరేట్ ) గురువారం రోజు రామగుండం పోలీస్ కమిషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్.,(ఐజీ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పోలీస్ ఆర్ముడ్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో , జాతీయ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామగుండం పోలీస్ కమిషనరేట్ పెద్దపల్లి మంచిర్యాల జోన్ ల ప్రజలకు కార్యాలయ అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపినారు.
ఈ సందర్భంగా సి పి మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ప్రభుత్వ అధికారులు భాగస్వామ్యంతో 14 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి రాష్ట్రాన్ని సాధించిన ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు , రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తున్నారు అన్నారు. తెలంగాణ ఉద్యమంలో ఎందరో అమరుల త్యాగధనుల ఫలితం ఈ ఆవిర్భవ దినోత్సవం వారిని ఎప్పుడూ మనం స్మరిస్తూ ఉండాలి ఉన్నారు, వారి త్యాగ ఫలం ద్వారా మనం ఈరోజు స్వేచ్ఛగా స్వతంత్రంగా జీవిస్తున్నామని తెలిపినారు. ప్రజలకు రాజ్యాంగం కల్పించిన చట్టం ప్రకారం నీతి నిజాయితీతో పారదర్శకతతో ధనిక పేద తేడా లేకుండా ప్రజలందరినీ సమానంగా చూసి పనిచేసి ప్రజల్లో మంచి పేరు పేరు ప్రఖ్యాతులు సాధించినప్పుడే ఈ మానవ జన్మకు సార్థకత ఉంటుందని తెలిపినారు. పోలీసులు నిరంతరం శాంతిభద్రతలు కాపాడటంలో ఎంతో శ్రమించి ప్రజల రక్షణ కోసం తమ ప్రాణాలను పణంగా పెట్టి ఎందరో వీర జవాన్లు సంఘ విద్రోహ శక్తులతో పోరాడి వారి ప్రాణాలను త్యాగం చేసినారు అని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత ఆధునిక సాంకేతికతను ఉపయోగిస్తున్న పోలీస్ వ్యవస్థగా పేరు ప్రఖ్యాతలు పొందిందని తెలిపారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉంటూ ప్రజలతో మమేకమై ప్రజల సమస్యలు తెలుసుకుని చట్ట పరిధిలో సమస్యలను పరిష్కరిస్తూ ప్రజల మన్ననలు పొందే విధంగా పనిచేయాలని అన్నారు.
ఈ కార్యక్రమంలో గోదావరిఖని ఏసిపి గిరి ప్రసాద్, రామగుండం ట్రాఫిక్ ఏసీపీ బాలరాజ్ , స్పెషల్ బ్రాంచ్ ఎసిపి మోహన్, ఏ ఆర్ ఏ సి పి సుందర్రావు, ccrb ఇన్స్పెక్టర్ కమలాకర్,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ప్రసాదరావు, రామగుండం ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్,ఐటీ సెల్ ఇన్స్పెక్టర్ కరుణాకర్, ఆర్ ఐ లు మధుకర్, శ్రీధర్,విష్ణు ప్రసాద్, సిసి శ్రవణ్ కుమార్, రామగుండం పోలీస్ సంఘం అధ్యక్షులు బోర్లకుంట పోచలింగం,ఎస్ఐ లు, ఆర్ ఎస్ఐ లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


