■ గుట్ట చాటుకు మట్టి దందా
■ నిబంధనలు పాటించని నిర్వాహకులు.
■ పర్మిషన్ తీసుకున్నది 25 వేల మెట్రిక్ టన్నులు చెప్పింది లక్ష టన్నులు.
■ మట్టి తవ్వకాల వద్ద కనిపించని పంచాయతీ కార్యదర్శి.
■ వే బిల్లులు చింపు తున్న దినసరి కూలీ.
■ గుట్ట మట్టి చెరువుకు చెరువు మట్టి బట్టికి.
■ ఓవర్ లోడ్ తో రోడ్డుపైన మొరాయించిన టిప్పర్లు.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )
పెద్దపల్లిజిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి గ్రామ పరిధిలోని చెరువులో నిబంధనలకు విరుద్ధంగా మట్టి తవ్వకాలు… నిర్భయంగా చేపడుతున్నారు….. జిల్లాకు చెందిన ఇద్దరు ఇటుక బట్టి నిర్వాహకులు. 25000 మెట్రిక్ టన్నుల మట్టి కొరకు పర్మిషన్ తీసుకున్నట్లు మైనింగ్ శాఖ ద్వారా రికార్డ్ అయి ఉంది. ఇట్టి విషయం *అగ్నిధార ప్రతినిధి* అక్కడ ఉన్న నిర్వాహకుడిని వివరణ కోరగా ఒక లక్ష మెట్రిక్ టన్నులకు పర్మిషన్ ఉందంటూ బుకాయించడంలో మర్మమేమిటో పర్మిషన్ ఇచ్చిన అధికారులకు తీసుకున్న నిర్వాహకులకే తెలియాలి….
.గుట్టమట్టి చెరువుకు చెరువుమట్టి బట్టికి
…. చెరువు పక్కనే ఉన్న గుట్టను జెసిపితో తవ్వుతూ ట్రాక్టర్ల ద్వారా మట్టిని చెరువులో దారి కోసమంటూ పోస్తున్నారు. అదేవిధంగా చెరువులోని మట్టిని బట్టీలకు నిబంధనలకు విరుద్ధంగా1.5 మీటర్ల లోతు కంటే ఎక్కువగా తోడుతూ తరలిస్తున్నారు……
.నిబంధనలు నీళ్లకువదిలారు
ప్రభుత్వం జారీ చేసిన నిబంధనలు ఎక్కడ పాటించినట్లు కనబడలేదు భట్టి యాజమానుల ఇష్టానుసారం మట్టి తవ్వుతున్న దాఖలు చెరువులో కనిపించాయి. తవ్వకాల కోసం బట్టి యాజమానులకు సంబంధిత శాఖ అధికారులు చెరువులో బౌండరీ ఫిక్స్ చేశారా. లేదా. అనే అనుమానం కలిగింది. ఒకవేళ బౌండరీ ఫిక్స్ చేసినట్లయితే నిర్దేశించిన ప్రాంతంలో మాత్రమే నిబంధనల ప్రకారం తవ్వాలి.కానీ చెరువు తవ్వకాలలో నిబంధనలు తుంగలో తొక్కినట్లే ఉంది. ప్రధాన రహదారికి చెరువు దూరంగా ఉండడంవల్ల గుట్ట చాటుగా ఉండడంతో అటువైపు కన్నెత్తి చూసే నాధుడే కరువయ్యారు. నిర్వాహకుల అక్రమ దందాకు అడ్డు అదుపు లేకుండా పోయిందనే విమర్శలు గుప్పుమంటున్నాయి. వారు ఆడింది ఆట పాడిందే పాటగా మట్టి నిర్వాహణ జరుగుతుంది అభిప్రాయం వ్యక్తం అవుతుంది.నిబంధనలు పాటించకుండా టిప్పర్ లో ఎక్కువ మొత్తములో మట్టి పోసి అక్రమంగా తరలిస్తున్నారు అనే చర్చ జరుగుతోంది. ఓవర్ లోడ్ కారణంగా పాలితం వద్ద నడిరోడ్డుపైనే టిప్పర్ మొరాయిండo. విశేషం….
చెరువు వద్ద కనిపించని ఏ ఒక్క అధికారి
రాష్ట్రంలో ఎక్కడ లేనివిధంగా చెరువుల నుండి ఇటుక బట్టీల కోసం అక్రమంగా మట్టి తరలిపోకుండా ఉండాలనే సత్సంకల్పంతో జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ వినూత్నమైన కార్యక్రమాన్ని జిల్లాలో చేపట్టి కొత్త ఒరవడిని సృష్టించారు. అనుమతి పొందిన ఇటుక బట్టి యజమానుల నుండి దరఖాస్తు చేసుకున్న వారికి అనుమతి పొందాక ..నిబంధనలు అనుసరించి అధికారుల పర్యవేక్షణలో మట్టి తవ్వకాలు చేపట్టాలని ఖచ్చితమైన ఆదేశాలు జారీ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ ఆదేశాలు తుంగలో తొక్కి ఏ ఒక్క శాఖ అధికారి దొంగతుర్తి చెరువు మట్టి తవ్వకాల వద్ద లేకపోవడం పలు విమర్శలకు తావిస్తుంది.
కనిపించని పంచాయతీ కార్యదర్శి.
.. నిబంధనల ప్రకారం మట్టి తవ్వకాలు చేపట్టే చెరువు వద్ద ఆయా గ్రామ పంచాయతీల పంచాయతీ కార్యదర్శి దగ్గర ఉండి జరుగుతున్న పనులను పరిశీలిస్తూ వే బిల్లు చిట్టిలను ఇస్తూ అక్రమంగా చెరువు నుండి మట్టి తరలిపోకుండా గట్టిగా నిబంధనలు పాటిస్తూ ఉదయం 6 నుండి సాయంత్రం ఆరుగంటల వరకు చెరువు మట్టి తవ్వకాల వద్ద ఉండాలి. కానీ అవేమీ తనకు పట్టనట్లు దొంగతుర్తి పంచాయతీ కార్యదర్శి మట్టి తవ్వకాల వద్ద లేకపోవడం పలు విమర్శలకు తావిస్తోంది. దానికి తోడు వే బిల్లులు చింపడానికి దినసరి కూలి ఒకరిని నియమించుకుని పనులుచక్కబెట్టుకుంటున్నారు.
మట్టి దందపై గుప్పుమంటున్న విమర్శలు
జిల్లాలో జరుగుతున్న మట్టి దందాపై రోజురోజుకు విమర్శలుఎక్కువవుతున్నాయిఅధికారుల, ప్రజాప్రతినిధుల అండదండలతోనే అక్రమ మట్టి దందా మూడుపువ్వులు ఆరుకాయలుగా కొన సాగుతోందనే ప్రచారం జరుగుతుంది. రేయి పగలు అనే తేడా లేకుండా జరుగుతున్న అక్రమ మట్టి రవాణ నిజమే అని బలం చేకూర్చేలా ఇప్పటికే వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, జిల్లా కలెక్టర్ కి జరుగుతున్న మట్టి దందపై పలువురు ఫిర్యాదులు చేశారు. ..
మాకు సంబంధం లేదు
పెద్దపల్లి జిల్లా మైనింగ్ ఏడి సాయినాథ్… నిబంధనలకు విరుద్ధంగా రాత్రి సమయంలో చెరువుల నుండి మట్టి తవ్వకాలు చేపడుతున్నారని దీనిపై చర్యలు తీసుకునే విషయంలో అగ్నిధార వివరణ కోరగా ఆయన స్పందిస్తూ ఆ విషయం మాకు సంబంధం లేదు, పోలీస్ శాఖ వారు చూసుకోవాలని అన్నారు.

మైనింగ్ అధికారులు ఇచ్చిన అనుమతి 1.5 మీటర్ల లోతు కానీ నీ పైన కనబడుతున్న ఫోటోలు ఏ మేరకు తవ్వారొ అధికారులకే తెలియాలి.
