జిల్లాలో 18 చెరువులు ,కుంటల్లో చట్టవిరుద్ధంగా మట్టి తవ్వకాలు.

దరఖాస్తు చేసుకున్న ఇటుక బట్టి యజమానులకు ఎన్ని క్యూబిక్ మీటర్లమట్టికి పర్మిషన్ ఇచ్చారు, తవ్వుతున్నది ఎంత.

ప్రజల మీద లేని ప్రేమ మట్టి మీద ఎందుకు   కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )జిల్లాలో జరుగుతున్న అక్రమ మట్టి  దందపైన కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఈర్ల కొమురయ్య  పార్టీ కార్యాలయంలో శుక్రవారం రోజు విలేకరుల సమావేశం నిర్వహించారు…. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…… జిల్లాలో మట్టి మాఫియా రోజు రోజుకి తీవ్రరూపం దాల్చి సహజ వనరులను కొల్లగొడుతున్నారు అన్నారు. ఇట్టి విషయమై  పత్రికలలో వరుస కథనాలు వస్తున్నాయన్నారు. అధికారుల తీరు మారకుంటే కాంగ్రెస్ పార్టీ పక్షాన జిల్లా వ్యాప్తంగా మట్టి మాఫియాపై ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. అధికారుల తీరు నిమ్మకు నీరెత్తినట్లు ఉందని విమర్శించారు. అధికారుల, ప్రజా ప్రతినిధుల అండదండలతో మట్టి మాఫియా  రెచ్చిపోతుంది అన్నారు. రాత్రి పగలు తేడా లేకుండా చెరువులలో గోతులు తోడుతున్నారు అన్నారు. జిల్లా మైనింగ్ అధికారుల నిర్లక్ష్య వైఖరితో మట్టి  హద్దులేకుండా పోతుందన్నారు.అధికారుల పర్యవేక్షణ కరువుతో అడ్డూ అదుపు లేకుండా  దందా జరుగుతుందన్నారు.  మైనింగ్ ఏడి  వెంటనే స్పందించ నట్లయితే రాష్ట్ర స్థాయి మైనింగ్ శాఖ అధికారులకి ఫిర్యాదు చేయబోతున్నాం అన్నారు. లక్షల  రూపాయలు రాత్రికి రాత్రి చేతులు మారుతున్న ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. మైనింగ్ శాఖ ద్వారా తీసుకునే పర్మిషన్ గోరంత మట్టి తవ్వకాలు కొండంత అన్నారు. గ్రామ స్థాయి ప్రజాప్రతినిధులు మొదలుకొని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధులు అందరూ మట్టి మాఫియాలో భాగస్వాములే అని విమర్శించారు. జిల్లా కలెక్టర్ ఇట్టి విషయంపై వెంటనే స్పందించి చర్యలు చేపటనట్లయితే త్వరలో జిల్లా కలెక్టరేట్ ను కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయా గ్రామాల  ప్రజలతో కలిసి ముట్టడి చేస్తామన్నారు.