జిల్లాలోని బెస్ట్ అవైలబుల్ స్కూల్ లలో విద్యార్థుల ఎంపిక పూర్తి:: అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) బెస్ట్ అవైలబుల్ స్కూల్ లో ప్రవేశం కొరకు విద్యార్థుల ఎంపిక పారదర్శకంగా నిర్వహించడం జరిగిందని అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ తెలిపారు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ ప్రవేశం ఎంపిక కొరకు బుధవారం కలెక్టరేట్ లోని సమావేశమందిరంలో లాటరీ పద్ధతిలో విద్యార్థులను ఎంపిక చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ….. గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో 3,5, 8వ తరగతులలో 10 సీట్లు అడ్మిషన్ కొరకు ఉన్నాయని, వాటిని వచ్చిన దరఖాస్తులలో తల్లిదండ్రుల సమక్షంలో లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు.అనంతరం ఎస్సీ సంక్షేమశాఖ ద్వారా 1వ తరగతి డే స్కాలర్, 5వ తరగతి రెసిడెన్షియల్ వచ్చిన 48 దరఖాస్తులో 27 లాటరీ పద్ధతి ద్వారా విద్యార్థులను ఎంపిక చేయడం జరిగిందని అదనపు కలెక్టర్ అన్నారు. ఈ కార్యక్రమంలోజిల్లా ఎస్సీ సంక్షేమ శాఖ అధికారి నాగలైశ్వర్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఎం. గంగారం, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.

