అగ్నిధారన్యూస్(  పెద్దపెల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లాలో అనుమతులు తీసుకుని 24 ఇటుక బట్టీల యజమానులు మట్టి దందాను మాఫియాగా తయారు చేసిన వైనం జిల్లాలో చర్చనీయాంశం అవుతుంది .చిన్న పెద్ద తేడా లేకుండా ఒక్కొక్కరికి  1000  రూపాయలు మొదలుకొని లక్షల  రూపాయల వరకు వారి స్థాయిని బట్టి మట్టి ముడుపులు ముట్టాయని  ప్రచారం జోరుగా సాగుతుంది. ఇందులో అధికారులు ప్రజా ప్రతినిధులు చోటామోటా నాయకులు అనే తేడాలేకుండా అందరికీ ఇస్తున్నామని బహిరంగంగానే మట్టి నిర్వాహకులు ప్రచారం చేస్తున్నారు. దీనితో జిల్లాలో జిల్లాస్థాయి అధికారుల ప్రజాప్రతినిధుల ప్రతిపక్షాల వ్యక్తిత్వం మసకబారే అవకాశాలు ఉన్నాయి .కాబట్టి ఇప్పటికైనా గట్టి చర్యలు తీసుకోనట్లయితే అనుమానాలకు ఆజ్యం పోసినట్లు అవుతుంది. ఇక మట్టి తవ్వకాలు ఎవరి ప్రయోజనాల కోసం చేపట్టారని ప్రజల్లో చర్చ  జోరుగా ఊపందుకున్నది. కొందరి  అధికారుల వద్దకు వెళ్లి సమాచారం అడిగినప్పుడు వాళ్ళు చెప్తున్న, అనుసరిస్తున్న విధానం మట్టి మాఫియా వెనుక వేస్తున్న తీరు చూస్తూ… ఉంటే  అనేక అనుమానాలకు బలం చేకూరుతుంది.