■ పరిశీలిస్తున్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ.
■ కార్యక్రమంలో పాల్గొన్న పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతి.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పట్టణ ప్రగతి అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ సంబంధిత అధికారులను ఆదేశించారు. శనివారం పెద్దపల్లి మున్సిపాలిటీ లోని పలు వార్డుల్లో పర్యటించి పట్టణ ప్రగతి పనులను పెద్దపల్లి మున్సిపల్ కమిషనర్ తిరుపతితో కలిసి కలెక్టర్ పర్యవేక్షించారు.
18వ వార్డు తెనుగు వాడ,12వ వార్డూ లో నిర్మిస్తున్న స్మశాన వాటికల పనులను పరిశీలించిన కలెక్టర్ పనుల్లో వేగం పెంచి త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తెనుగు వాడ లో ఏర్పాటు చేసిన నర్సరీ పరిశీలించి మొక్కల పెంపకం సంరక్షణ కు సంబంధించి అధికారులకు పలు సూచనలు చేశారు.
బందంపల్లి 1 వ వార్డు నుంచి జిల్లా ప్రారంభం వరకు రోడ్లపై మొక్కలను రిప్లెస్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో ఫ్లైఓవర్ గోడలకు పెయింటింగ్ వేసి సుందరీకరణ పనులు చేపట్టాలని కలెక్టర్ సూచించారు.
పెద్దపల్లి పట్టణంలోని ఎల్లమ్మ చెరువు కట్ట పనులు పరిశీలించిన కలెక్టర్ అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. పట్టణంలో రోడ్లు పారిశుధ్య నిర్వహణ మెరుగు పరచాలని అధికారులకు కలెక్టర్ సూచించారు.
ఈ కార్యక్రమంలో మేనేజర్ శివ ప్రసాద్, సంబంధిత అధికారులు, పాల్గొన్నారు.

