అగ్నిధారన్యూస్ ( సంగారెడ్డిజిల్లా ) వట్పల్లి మండలంలో శనివారం అందోల్ MLA చంటి క్రాంతి కిరణ్ గ్రామాలలో నాగులపల్లి,నిర్జప్ల, ఉసిరికపల్లి,దరఖాస్తు పల్లి షాద్నగర్ , దేవునుర్, పాలడుగులలో పర్యటించారు. మన ఊరు మన బడి ,క్రికెట్ క్రీడమైదానాలను,గ్రామంలోని వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ….. నియోజకవర్గ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తున్నామన్నారు అభివృద్ధి ధ్యేయంగా అన్ని వర్గాలను కలుపుకుని పోయి రానున్న రోజుల్లో నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసేలా కృషి చేస్తానన్నారు. ప్రభుత్వం చేపట్టే కార్యక్రమాలన్నింటినీ అధికారులు ప్రజా ప్రతినిధులు సమన్వయంతో ముందుకు నడవాలి అన్నారు. కార్యక్రమానికి మండలంలోని జడ్పీటీసీ అపర్ణ,ఎంపీపీ పత్రి కృష్ణవేణి ,వరం అధ్యక్షులు వీరారెడ్డి ,మండల ఎంపీటీసీలు, సర్పంచ్ లు,ఉప సర్పంచ్ లు ఆయా గ్రామాలకు చెందిన TRS అధ్యక్షులు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.