అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి )
టిఆర్ఎస్ పార్టీ మాజీ ఎమ్మెల్యే నల్లాల ఓదెలు పార్టీని వీడి ఇటీవల కాంగ్రెస్ లో చేరిన సందర్భంగా టిపిసిసి కార్యదర్శి పెర్క శ్యామ్ పెద్దపల్లిలో గల తన నివాసానికి మర్యాదపూర్వకంగా ఆహ్వానించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే ఓదేలు మాట్లాడుతూ… కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి కోసం అహర్నిశలు పనిచేస్తూ… పార్టీని రాష్ట్రంలో, దేశంలో అధికారంలోకి తీసుకురావడానికి ప్రతి కార్యకర్త కంకణబద్ధులై పనిచేసే విధంగా ప్రయత్నాలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో టిపిసిసి ఎస్సిసెల్ స్టేట్ కన్వీనర్ పెర్క సంతోష్,మైనారిటీ సెల్ స్టేట్ కన్వీనర్ ఫయాజ్, యూత్ కాంగ్రెస్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి మేకల సతీష్, కాంగ్రెస్ నాయకులు పెర్క సమాధానం ఉన్నారు.
