అగ్నిధారన్యూస్( పెద్దపల్లి క్రైమ్ )పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం గోపయ్య పల్లె గ్రామానికి చెందిన విశ్రాంతి సింగరేణి ఉద్యోగి దాత శంకరయ్య, ధాతు కనకలక్ష్మి, తమ అవసరాల నిమిత్తం పెద్దపల్లికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తున్న క్రమంలో పెద్దమ్మ నగర్ వద్ద ఎదురుగా వస్తున్న ఆటో  డి కొట్టిన ప్రమాదంలో  ధాతు శంకరయ్య అక్కడికక్కడే మరణించగా దాత కనకలక్ష్మి తీవ్రగాయాలు కాగా   కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పెద్దపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. పెద్దపల్లి ఎస్ ఐ రాజేష్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.