■ పెద్దపల్లి మాజీ వైస్ ఎంపీపీ కట్కూర్ సుధాకర్ రెడ్డి.
■ కాంగ్రెస్ గూటికి గురువారం చేరిక
అగ్నిధారన్యూస్ పెద్దపల్లి పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం మూల సాల గ్రామానికి చెందిన మాజీ వైస్ ఎంపీపీ కట్కూరు సుధాకర్ రెడ్డి టిఆర్ఎస్ పార్టీని వీడి రేపు గురువారం రోజు తిరిగి మాజీ ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. తెలంగాణ ఉద్యమ కాలంలో తెలంగాణ కోసం ఎంపిటిసి పదవికి రాజీనామా చేసి తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర వహించారు. అదేవిధంగా ముకుంద రెడ్డికి అతి సన్నిహితుడిగా పేరొందిన వ్యక్తి కట్కూర్ సుధాకర్ రెడ్డి కాంగ్రెస్ మీద ఉన్న మమకారంతో మళ్లీ సొంతగూటికి చేరతున్నట్లు విశ్వసనీయ సమాచారం.
