రోడ్డుపైన చెత్త ఇట్లా అయితే ఎట్లా.
■ పందుల స్వైర విహారం.
■ గ్రామాల్లో అధికారుల పర్యవేక్షణ కరువు.
■ మండల కేంద్రంతో పాటు గ్రామాల్లో చెత్త.
■ గుంటూరుపల్లి దారిలో రోడ్డుపైన చెత్త కుప్ప దర్శనం.
అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా )మేజర్ గ్రామ పంచాయతీ అయినా కమాన్ పూర్ లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తంగా తయారయింది. నిన్న మొన్నటి వరకు పల్లె ప్రగతి కార్యక్రమాల తోటి శుభ్రత వైపు జిల్లా లోని గ్రామాలు ముందుకు వెళుతూ ఉంటే కమాన్ పూర్ లో మాత్రం పారిశుద్ధ్యం పడకేసినది అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. అందుకు తగ్గట్టు పారిశుద్ధ్య లోపం స్పష్టంగా కనబడుతుంది….
పడకేసిన పారిశుధ్యం
.. కమాన్ పూర్ మండలంతో పాటు జిల్లాలో కూడా పారిశుద్ధ్యం పనులు నిర్వహించడంలో కొందరు పంచాయతీ అధికారులు పాలకవర్గం అలసత్వం ప్రదర్శించడం వల్ల చెత్త చెదారంతో మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో వ్యర్ధ పదార్థాలతోటి కంపు కొడుతున్నాయి . అదేవిధంగా ప్లాస్టిక్ చెత్త ప్రధాన రోడ్లపై కుప్పలుతెప్పలుగా దర్శనమిస్తున్నాయి …
పట్టించుకోని పంచాయతీ అధికారులు
.. కమాన్ పూర్ మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాలలో పంచాయితీ అధికారి పర్యవేక్షణ లోపంతో మండలంలో పారిశుద్ధ లోపం స్పష్టంగా కనబడుతుందని ప్రజలు గుస గుస లాడుతున్నారు.
డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తం
మండల కేంద్రంతో పాటు ఆయా గ్రామాల్లో డ్రైనేజ్ వ్యవస్థ నిర్వహణ లోపం, ప్రధాన రహదారుల, ఇండ్ల మధ్య చెత్త చెదారంతో ప్లాస్టిక్ వ్యర్థాలతో అస్తవ్యస్తంగా వ్యవస్థ అద్వానంగా కనబడుతోంది అనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి….
చెత్త సేకరణలలో పంచాయతీ అధికారుల నిర్లక్ష్యం
మండలంలో ప్రతినిత్యం తడి చెత్త పొడి చెత్త సేకరించి దానిని కంపోస్ట్ ఎరువు గా మార్చాల్సి ఉన్నప్పటికీ చెత్త సేకరణలో పంచాయతీ అధికారులు అలసత్వం ప్రదర్శిస్తున్నారు అనే ఆరోపణలు వినబడుతున్నాయి.. అదేవిధంగా ఆయా గ్రామాలలో మండల కేంద్రంలో చెత్త సేకరణ విషయంలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్న వైనం స్పష్టంగా కనబడుతుంది .పారిశుద్ధ్యం కార్యక్రమాలు సక్రమంగా చేపట్టి అపరిశుభ్రం ప్రాంతాలను శుభ్రపరిచి బ్లీచింగ్ చల్లించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న తీరు జిల్లాలో సర్వత్రా విమర్శలకు దారితీస్తోంది. కమాన్ పూర్ మేజర్ గ్రామ పంచాయతీ కావడంచేత పారిశుద్ధ్య పనుల నిర్వహణలో ఆలస్యం అవుతుంది అన్న అధికారుల వివరణ వారి పనితనాన్ని తెలుపుతుంది.
పందుల స్వైర విహారం
కమాన్ పూర్ మండల
కేంద్రంలో ఆయా వార్డుల్లో పందుల స్వైర విహారం చేస్తున్న తీరు ప్రజలలో ఆందోళన కలిగిస్తుంది రాబోయే వర్షాకాలం సీజన్ లో అపరిశుభ్రత వల్ల అనేక రకాల వ్యాధులు సంభవించే అవకాశం ఉన్నా అధికారులు పట్టించుకున్న పాపాన పోవడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అపరిశుభ్రత ప్రాంతాలలో పందులు చేరి ఆ ప్రాంతం అంతా దుర్గంధం రేకెత్తిస్తున్నాయి. సంబంధిత పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టనట్లఅయితే రాబోయే రోజుల్లో ప్రజలు అనేక రకాల వ్యాధుల బారిన పడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా పంచాయతీ అధికారి కమాన్ పూర్ మండలంపైన ప్రత్యేక దృష్టి సారించి,గ్రామాలలో పారిశుద్ధ్యం నిర్వహణ సక్రమంగా ఉండేలా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు.
కమాన్ పూర్ మండల కేంద్రంలో చెత్తతో కూడిన ప్రాంతాలు.


