మండల పంచాయతీ అధికారి కార్యాలయం.

అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) పెద్దపల్లిజిల్లా కమాన్ పూర్ మండల పరిషత్ కార్యాలయంలో సంవత్సరాల కొద్దీ గ్రామీణ ఉపాధి హామీ కార్యాలయ రికార్డ్స్ లు మండల పరిషత్ కార్యాలయం పై అంతస్తులో గుట్టలుగుట్టలుగా కనబడతాయి. మండల పంచాయతీ అధికారి వద్దకు ఆయా గ్రామ పంచాయతీల అవసరాల కోసం వచ్చే గ్రామ సర్పంచులకు, ఎంపీటీసీలకు, అలాగే గ్రామీణ ఉపాధి హామీ ఏపిఓ కార్యాలయానికి తమ అవసరాల నిమిత్తం వచ్చే ప్రజలకు ముందుగా దర్శనమిచ్చేది కుప్పలు తెప్పలుగా పడివున్న ఈజీఎస్ రికార్డ్స్. *మరి సంబంధిత కార్యాలయ అధికారులు కనబడలేదా అంటే అదేమీ లేదు నిత్యం చెత్త దర్శనo కలిగిన తర్వాతే కార్యాలయ దర్శనానికి వెళతారు*. మండలంలోని ఆయా గ్రామ పంచాయతీల ఉపాధి హామీ పనులకు సంబంధించిన రికార్డ్స్ ను అలా నిర్లక్ష్యంగా పడి వేయడం ద్వారా అందులో ఉన్న రికార్డ్స్లు మిస్ అయినట్లు అయితే దానికి బాధ్యత వహించేది ఎవరు? అనేది ప్రశ్న… ఒకవేళ అవి పనికిరాని రికార్డ్స్ *సామాజిక తనిఖీ కాలపరిమితి దాటినవి అయినట్లయితే* ప్రత్యేకమైన గదిలో భద్ర పరచాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం పల్లె ప్రగతి, పట్టణ ప్రగతి పేర్లతో పారిశుద్ధ్య కార్యక్రమాలు గొప్పగా చేపడుతూ ఉంటే జిల్లా కేంద్రానికి అతి సమీపంలో ఉన్న కమాన్ పూర్ కార్యాలయంలో కార్యాలయ ప్రగతి కార్యక్రమం చేపట్టాల్సిన అవసరం ఉందని ప్రజలు అంటున్నారు……

అగ్నిధార కమాన్ పూర్ మండల పరిషత్ కార్యాలయానికి వచ్చే వారి ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ ను సంవత్సరాల కొద్దీ నిలువ ఉంచిన పేపర్ ద్వారా ఏమైనా వ్యాధులు సంక్రమిస్తాయా అని వివరణ కోరినప్పుడు, ఆయన మాట్లాడుతూ చాలా సంవత్సరాలుగా నిల్వ ఉంచిన కాగితాల ద్వారా ఎలర్జిటిక్ లంగ్స్ డిసీజెస్ , చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయని స్పష్టం చేశారు. కాబట్టి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికైనా సంబంధిత శాఖ ఉన్నతాధికారులు అటువైపు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.