అగ్నిధార న్యూస్ మంథని:ముత్తారం మండలం కేషన్ పల్లి గ్రామానికి చెందిన T. మధుకర్ పొట్టకు సంబంధించిన ఆనారోగ్యంతో హైదరాబాద్ లోని నిమ్స్ ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుటకు సహాయం కోరగా మంథిని శాసన సభ్యులు శ్రీధర్ బాబు వెంటనే స్పందించిన ఆయన CMRF ద్వారా వైద్య ఖర్చుల నిమిత్తo రూ.150000 రూపాయల CMRF ద్వారా LOC మంజూరు చేయించినారు. అట్టి మంజూరీ పత్రాన్ని శాసన సభ్యుడి ఆరోగ్య సహాయకుడు మధుకర్ కుటుంబ సభ్యులకు అందజేశారు. ఎల్ ఓ సీ మంజూరీ ఇప్పించిన శాసనసభ్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు మధుకర్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలుతెలియజేశారు.
