అగ్నిధార న్యూస్, మంథని:
రామగిరి మండలం నవాబ్ పేట గ్రామానికి చెందిన యుత్ కాంగ్రెస్ నాయకుడు కట్ట కిరణ్ ఈరోజు హుజురాబాద్ ఎన్నికల ప్రచారంలో భాగంగా శ్రీధర్ బాబు తో కలిసి ఇంటింట ప్రచారం చేయడం జరిగింది. ఈ సందర్భంగా మంథని శాసనసభ్యులు దుద్దిళ్ళ శ్రీధర్ బాబు మాట్లాడుతూ కాంగ్రెస్ అభ్యర్థి అయినటువంటి బల్మూర్ వెంకట్ విద్యార్థి సంఘ ఉద్యమ నాయకుడు ప్రజలకు అందుబాటులో ఉండి ప్రజల సమస్యల పైన నిరంతరం పోరాడే శక్తి యుక్తి ఉన్న యువ నాయకుడు వెంకట్ అన్నారు వెంకట్ ని హుజరాబాద్ లో గెలిపించి నట్లయితే శాసనసభలో మీ ప్రశ్నించే గొంతుగా హుజురాబాద్ ప్రజల పక్షాన మాట్లాడతారు అన్నారు.
