వరద నీరు ఉదృతంగా ఉన్న ప్రాంతాలను సందర్శించి అధికారులకు సూచనలు చేసిన సీపీ
అగ్నిధారన్యూస్( రామగుండంకమిషనరేట్ ) గత కొద్ది రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు రామగుండం కమిషనరేట్ పరిధిలోని దాదాపు అన్ని ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి.రామగుండం కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాల మేరకు కమిషనరేట్ పరిధిలోని డిసిపి, అఖిల్ మహాజన్ ఏసీపీలు సారంగపాణి, గిరి ప్రసాద్, నరేందర్, మహేష్, తిరుపతిరెడ్డి సిఐ లు ఎస్ ఐ లు పోలీస్ సిబ్బంది అందరూ ప్రజా ప్రయోజనాల కోసం ఆవిరామంగా అహర్నిశలు కృషి చేస్తున్నారు. అందులో భాగంగా గురువారం రోజు. రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్ చంద్రశేఖర్ రెడ్డి ఐపిఎస్., *డీసీపీ అడ్మిన్ అఖిల్ మహాజన్ ,* అధికారులతో కలిసి *గోదావరిఖని గంగ నగర్ , ఇందారం ఫారెస్ట్ చెక్ పోస్ట్* వద్దకు వెళ్లి అక్కడి పరిస్థితులను పరిశీలించి వాహనాలను అనుమతించ కూడదని, బ్రిడ్జ్ కు ఇరువైపుల నుండి వరద నీరు ప్రవహిస్తున్నందున వాహనాలు దారి మళ్ళించాలని, అధికారులు, సిబ్బంది స్థానికంగా ఉంటూ అప్రమత్తంగా వ్యవహారించాలని సూచించారు. మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలను కలుపుతూ ఉన్న గోదావరి బ్రిడ్జ్ గోదావరి వరద నీరుతో ఉదృతంగా ప్రవహిస్తుంది. వరద నీరుతో చుట్టూ ప్రక్కల 2 కిలోమీటర్లు మేరకు నీరు రావడంతో రాకపోకలు నిలిచిపోయాయి తెలిపారు. ఈ విషయం ప్రజలందరూ గమనించి అటువైపుగా వెళ్లకుండా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో
ఏసీపీ గిరి ప్రసాద్, గోదావరిఖని1 టౌన్ ఇన్స్పెక్టర్ రమేష్ బాబు, గోదావరిఖని 2 టౌన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ రావు, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, సీఐ రాజు, ఎస్ఐ రామకృష్ణ, జైపూర్ పోలీస్ సిబ్బంది ఉన్నారు.

