అగ్నిధారన్యూస్( పెద్దపల్లి )   పెద్దపల్లి జిల్లా పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో ఆదివారం రోజు పెను ప్రమాదం చోటుచేసుకుంది రైతు కలవేనా రాము తన పాడి ఆవులు ఆరుబయట కట్టేసి పాలు పిండి తన పనుల్లో నిమగ్నమయ్యాడు. కొద్ది సమయంలోనే పైన ఉన్న విద్యుత్ తీగ ఒక్కసారిగా తెగిపడంతో ఆవు తన కళ్ళముందే గిలగిలా కొట్టుకుంటూ క్షణాల్లో ప్రాణాలు వదిలింది. నిస్సాహస్థితిలో రైతు చూస్తూ ఉండిపోయాడు. ఆవు చనిపోవడం వల్ల  50000రూపాయల  వరకు నష్టపోయానని తెలిపాడు.వ్యవసాయ పనులమీద అటుగా వస్తున్న రైతులను అప్రమత్తం చేయడంతో పెను ప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం తెలియజేశారు. రైతుకు జరిగిన నష్టాన్ని ప్రభుత్వమే చెల్లించాలని సర్పంచ్ సత్యం అన్నారు.