అగ్నిధారన్యూస్( జగిత్యాలజిల్లా) వరదలో చిక్కుకున్న తొమ్మిది మంది కూలీల వార్త కవరేజ్ కోసం వెళ్లి అనుకోకుండా గత మూడు రోజుల క్రితం  వరద ప్రమాదంలో చిక్కుకొని మృతి చెందిన జగిత్యాల NTV రిపోర్టర్ జమీర్ అంతిమ యాత్ర లో పాల్గొని, కుటుంబ సభ్యుల ను ఓదార్చిన జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ జిల్లా జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ .ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ…. జమీర్ అకాల మృతికి చింతిస్తున్నామన్నారు. ప్రజలకు ,ప్రజా ప్రతినిధులకు, తలలో నాలుకల ఉండి అందరి మన్ననలు పొందిన వ్యక్తి, నేడు లేడు అనే చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నామన్నారు. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. ఈ అంతిమ యాత్రలో జిల్లాలోని ప్రజా ప్రతినిధులు, పాత్రికేయ మిత్రులు ,శ్రేయోభిలాషులు ,తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.