బోనాల  వేడుకలలో జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత.

పాల్గొన్న మున్సిపల్ చైర్ పర్సన్ శ్రావణి.

అగ్నిధార న్యూస్ (జగిత్యాల) పట్టణంలోని శ్రీ ముత్యాల పోచమ్మ తల్లీ బోనాల పండుగలో పాల్గోని మహిళలతో కలిసి బోనం ఎత్తి ప్రత్యేక పూజలు నిర్వహించిన జిల్లా జడ్పీ చైర్ పర్సన్ దావ వసంత సురేష్ మాట్లాడుతూ…. మన తెలంగాణ పట్టణాల్లో గ్రామాల్లో సంస్కృతికి, సంప్రదాయాలకు ప్రతీక…

బోనాలు, ఆషాఢంలో ముఖ్యంగా ఆదివారం అమ్మ వారికి బోనం సమర్పిస్తారు అన్నారు.ఆషాడ మాసంలో ప్రజలు ఎలాంటి రోగాల బారిన పడకుండా,పాడిపంటలు చల్లగా ఉండాలని అమ్మవారికి ప్రతి ఏటా బోనాలు సమర్పిస్తారు అన్నారు. ఆ  తల్లి అందరిని చల్లగా చూడాలని కోరుకుంటున్నాము అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ భోగ శ్రావణి  వార్డ్ కౌన్సిలర్స్ పిట్ట ధర్మరాజు, బండారి రజనీ, నరేందర్,   కతురోజు గిరి, మున్నూరు కాపు సంఘ కుల సంఘ నాయకులు యువకులు మహిళలు  తదితరులు పాల్గొన్నారు.