■ డ్రైవర్ ప్రవీణ్ కుటుంబానికి అండగా ఎమ్మెల్యే కోరుకంటి చందర్.
■ ఎమ్మెల్యే చోరవతో మృతుని కుటుంబానికి 18 లక్షలు నష్టం పరిహారం.
అగ్నిధారన్యూస్ ( రామగుండం ) రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్
పి.సి.పటేల్ కంపనీలో డైవర్ గా పనిచేస్తు ఆత్మహత్య కు పాల్పడిన ప్రవీన్ కుటుంబానికి అండగా నిలిచారు. గత నెల రోజుల క్రితం ప్రవీన్ ఆత్మహత్యకు ప్రయత్నించగాహైదరాబాద్ నిమ్స్ లో చికిత్స పోందుతున్న సమయంలో బాధితున్ని ఎమ్మెల్యే స్వయంగా వెళ్లి పరమర్శించారు. సిఎం సహాయనిధి ద్వారా ప్రవీన్ చికిత్స నిమిత్తం 1 లక్ష 50 వేల ఎల్.ఓ.సి చెక్కును ఎమ్మెల్యే అందించారు. ప్రవీన్ ఆరోగ్య పరిస్దితిని తెలుసుకుని మెరుగైనా వైద్యం అందించాలని వైద్యులకు సూచించారు. కాగా గోదావరిఖని ఆసుపత్రిలో చికిత్స పోందుతూ ప్రవీన్ బుధవారం అర్దరాత్రి మృతిచెందాడంతో తోటి కార్మికులు మృతుని బంధువులు ఆందోళనాకు దిగారు. మృతికి కారకులైన వ్యక్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే అర్దరాత్రి ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుని బాధితులను ఓదార్చారు. మృతుని కుటుంబానికి న్యాయం జరిగేలా చుస్తానని సంబంధిత పి.సి. పటేల్ కంపని యాజమాన్యం మేడలు వంచి మృతుని కుటుంబానికి 18 లక్షల రుాపాయలు నష్టం పరిహారం అందించేలా కృషి చేశారు.
