■  నేడు దాశరథి కృష్ణమాచార్య జయంతి

 ★★అగ్నిధార నవల రచయిత★★

అగ్నిధారన్యూస్(  డెస్క్ )ఆయన ఒక ప్రభంజనం కదులుతున్న విజ్ఞాన భాండాగారం అనుకున్న ఆశయ సాధన కోసం వెన్ను చూపని గొప్ప దార్శనికుడు. ప్రజా సమస్యలపై తన కలంతో గలమెత్తిన గొప్ప సాహిత్య ఉద్యమకారుడు నిజాం పరిపాలకులను తన రచనలతో ఎప్పటికప్పుడు ఎండగట్టిన ధీరుడు ఆయనే దాశరథి కృష్ణమాచార్యులు. తన అగ్నిధార నవలలో నా తెలంగాణ కోటి రత్నాల వీణ అని సగర్వంగా ప్రపంచానికి చాటిన మేధావి, సాహిత్య ఉద్యమకారుడు. నిజం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ప్రయోజనాల కోసం, అనేక రచనలు,కవితల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడు జాగృతం చేస్తూ నిజం పరిపాలకుల నియంతృత్వ పోకడలకు నిదర్శనంగా జైలు జీవితం గడిపిన వ్యక్తి దాశరధి కృష్ణమాచార్యులు  మహబూబాబాద్ జిల్లా లో 1925  జూలై 22 తారీకు రోజున జన్మించారు. సామాన్య  మధ్యతరగతి కుటుంబంలో పుట్టి సంఘసంస్కరణ కోసం జీవితాన్ని దార పోసిన గొప్ప వ్యక్తి దాశరథి అనేక రచనలు కవితలు సినీ గేయాలతో ప్రజల మనసులను గెలుచుకున్న గొప్ప వ్యక్తి అగ్నిధార, రుద్రవీణ ,అమృతాభిషేకం ,తిమిరంతో సమరం, బాల గేయాలు, వంటి ఎన్నో నవలలను రచించిన మేధావి తన రచనల ద్వారా ప్రజలను నిత్య చైతన్యం పరిచారు. నిజాం పరిపాలనలో తెలంగాణ ప్రజలను తన భావ జాలంతో నిజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా భావ పేరుత ప్రసంగాలు చేస్తూ, ఊరూరు తిరుగుతూ ప్రజలను నిత్య చైతన్యపరిచారు. 1953 వ సంవత్సరంలో తెలంగాణ రచయితల సంఘాన్ని స్థాపించారు. ప్రతి సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వం సాహిత్య రంగంలో కృషి చేసే వారికి దాశరథి పేరు మీద అవార్డులు  ఇవ్వడం జరుగుతుందంటే,ఆయన కు సాహిత్య రంగంలో  ఎంత గొప్ప స్థానం ఉందో తెలుస్తుంది. తొలి దశ మలిదశ  తెలంగాణ ఉద్యమంలో ప్రముఖంగా ప్రజల్లో నానిన వాక్యం …..నా తెలంగాణ కోటి రత్నాల వీణ ……అనే నినాదం పల్లె పల్లెకు గుడిసె గుడిసెకు వెళ్లి తెలంగాణ ప్రజలని ఏకీకృతం చేసిందనడంలో తెలంగాణ సాధించడంలో ఎంతగానో దోహద పడింది  నాటికి నేటికి  ఏనాటికైనా దాశరధిని ఆయన నవలలను తెలంగాణ ప్రజలు మరచిపోరు అనేది నిజం.