అమానుషం..మురికి కాలువలో అప్పుడే పుట్టిన శిశువు.

అగ్నిధారన్యూస్ (రామగిరి మండలం ) రామగిరి మండలం బేగంగేట్ గ్రామంలో అమానుష ఘటన చోటు చేసుకుంది. అప్పుడే పుట్టిన శిశువు మురికి కాలువలో కనిపించడంతో  స్థానికంగా ఒకసారి గా స్థానికంగా కలకలం సృష్టించింది .బేగంపేట్ గ్రామంలో శనివారం ఉదయం స్థానికులు డ్రైనేజీ కెనాల్ లో మగశిశువు మృత దేహాన్ని స్థానికులు గుర్తించారు. దీంతో పోలీసులకు సమాచారం అందించడంతో ఘటన స్థలానికి చేరుకొని ఘటన స్థలానికి రామగిరి ఎస్ ఐ రవి ప్రసాద్ చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. శిశువు మృతదేహం కాలువలో పడి ఉండడంతో పోలీస్ శాఖ వివిధ   వివిధ కోణాలలో దర్యాప్తు చేస్తున్నరు… చనిపోయిన శిశువుని మురికి కాలువలో పడవేశారా ? లేక ప్రాణంతో ఉన్న శిశువుని మురికి కాలువలో పారేశారా ? ఎవరు పారేశారు ? ఎప్పుడు పారేశారు ? అనే విషయాలు తెలియాల్సి ఉంది.