■ ఆర్ ఎఫ్ సి ఎల్ లో ఉద్యోగాల ఇప్పిస్తామని లక్షల్లో వసూళ్ళు.
■ వసూలు రాజాలపై పోలీసులు కేసు నమోదుచేసి బాధితులకు న్యాయం చేయాలి.
■ కాంగ్రెస్ పార్టీ రామగుండం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజ్ ఠాకూర్.
అగ్నిధార న్యూస్ (రామగుండం ): రామగుండం నియోజకవర్గంలో పరిశ్రమలు వస్తే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని అనుకున్న తరుణంలో మూతపడ్డ FCI మళ్ళీ RFCL గా పునరుద్దరణ అయి ఈ ప్రాంతపు ప్రజాప్రతినిధులు, వారి బంధువులు.అనుచరులు దళారుల అవతారమెత్తి అందిన కాడికి దోచుకుంటున్నారని రామగుండం నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ఎం.ఎస్. రాజ్ ఠాకూర్ అన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ…గతంలో రామగుండం శాసనసభ్యులు, ఆయన అనుచరులు నిరుద్యోగుల నుండి లక్షల రూపాయలు తీసుకొని RFCL లో ఉద్యోగాలు పెట్టిస్తామని చెప్పి కాలయాపన చేస్తూ చివరకు ఉద్యోగాలు పెట్టించక, డబ్బులు ఇవ్వకుండా, ఆ దళారుల ఇండ్ల ముందు ధర్నా కార్యక్రమాలు చేసినా కూడా ఇక్కడి ప్రజాప్రతినిధుల్లో ఎలాంటి మార్పులు రాకపోవడం నిజంగా దురదృష్టకరమన్నారు.ఇలాంటి ఘటనలు మరువకముందే దాదాపుగా 100మందికి పైగా RFCL ఉద్యోగ బాధితులు అనే ఫ్లెక్సీతో చౌరస్తాకి వచ్చి వారి వద్ద నుండి లక్షలు లక్షలు తీసుకున్న వారి పేర్లు బహిరంగానే చెబుతూ నిరసన వ్యక్తం చేసారన్నారు. రామగుండం పోలీస్ కమీషనర్ ప్రత్యేక చొరవ తీసుకొని,ఆ భాదితుల వద్ద నుండి లక్షలు లక్షలు తీసుకున్న వారిపై కేసు నమోదు చేసి, ఇందులో ముఖ్య సూత్రదారులుగా వున్న ప్రతి ఒక్కరిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసారు.అదే విధంగా స్థానిక శాసనసభ్యులిని హెచ్చరిస్తూ,వారి బంధువులు,అనుచరుల నుండి బాధితులకు డబ్బులు ఇప్పించే పూర్తి బాధ్యత మీదేనని, లేని పక్షంలో ఆ బాధితులందరూ ఐకమత్యంగా ఉండి, వారికి అండగా వారి పక్షాన ఎంతటి పోరాటమైనా చేసి, వారికి న్యాయం చేయడానికి కృషి చేస్తానని అన్నారు.
