ప్రముఖ సామాజిక వేత్త చిలుముల రమేష్.
( అగ్నిధారన్యూస్ కామేపల్లి ) అమ్మ ప్రేమ అమృతం అని
నాన్న ప్రేమ అద్భుతమని ప్రముఖ సామాజిక వేత్త, జాతీయ ఉత్తమ అవార్డు గ్రహీత చిలుముల రమేష్ అన్నారు.తల్లిదండ్రుల దినోత్సవాన్ని పురస్కరించుకొని కామేపల్లి లో
ఆదివారం తన తల్లిదండ్రులు చిలుముల బిక్షం- మంగమ్మ జ్ఞాపకార్థం పి హెచ్ సి లో రోగులకు పండ్లను పంపిణీ చేశారు.వృద్ధులకు, అనాధలకు ఆహార పదార్థాలను అందజేశారు.గ్రామంలోని మహిళలకు పచ్చటి మొక్కలను అందజేశారు.అనంతరం రమేష్ మాట్లాడుతూ అమృతాన్ని పంచి మనకు అద్భుతమైన భవిష్యత్తును కల్పించే అమ్మ నాన్నలకు పాదాభివందనాలు అన్నారు.కనిపించని దైవం కన్నా కనిపించిన తల్లిదండ్రులేమిన్న అన్నారు.ఈ కార్యక్రమంలో బిక్షం- మంగమ్మ కుమారులు చిలుముల శ్రీనివాస్, సర్వయ్య, గ్రామ పెద్దలు పోలూరి రామచంద్రయ్య- కళావతి దంపతులు, జర్పల రమేష్,
108 ఈ ఎం టి బొల్లు లింగమూర్తి, పైలెట్ పోతన బోయిన సుధాకర్రావు , ఏఎన్ఎం గీత,ఆశ కార్యకర్త గమ్మి, గ్రామస్తులు అజ్మీర బద్రు నాయక్, కందిబండ నరసింహారావు, నాగయ్య, మహిళలు, పేదలు తదితరులు పాల్గొన్నారు.

