అగ్నిధార న్యూస్ ( పెద్దపల్లిజిల్లా ) సోమవారం రోజు స్థానిక ఆర్ ఆర్ గార్డెన్లో నిర్వహించిన జిల్లా రియల్ ఎస్టేట్స్ ఎన్నికల సన్నాహాసభకు ముఖ్యఅతిథిగా హాజరైన నారగోని ప్రవీణ్ కుమార్ మాట్లాడుతూ… రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల పైన సమావేశంలోసుదీర్ఘంగా ఉపన్యసించారు. సమస్యల సాధన కోసం ప్రతి ఒక్కరు ఐక్యతగా ముందుకు సాగాలన్నారు.ఈ సందర్భంగా పెద్దపల్లి జిల్లా రియల్ ఎస్టేట్స్ అసోసియేషన్ అడాక్ కమిటీ అధ్యక్షులుగా పెగడ రమేష్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తనపై నమ్మకం ఉంచి అధ్యక్షులుగా ఎన్నుకున్నందుకు జిల్లాలోని రియల్ ఎస్టేట్ వ్యాపారులకి ప్రత్యేకత కృతజ్ఞతలు తెలిపారు. రియల్ ఎస్టేట్ రంగంలో ఎదుర్కొంటున్న సమస్యల సాధన కోసం శక్తివంతం లేకుండా అందరి సహాయ సహకారాలతో కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు ప్రవీణ్ కుమార్ ఎన్నికైన సభ్యుల్ని ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ గా రవికుమార్, గౌరవాధ్యక్షులుగా జడ్పీటీసీ రామ్మూర్తి, సందనవేన రాజేందర్ ఎన్నుకున్నారు. రామస్వామి, చిరంజీవి, సంపత్ రావు, తిరుపతి, కుమార్, తదితరులు ఎన్నికయ్యారు.

