■ 14వ డివిజన్లో నరకాన్ని తలపిస్తున్న అంతర్గత రహదారులు.
■ పట్టించుకోని ప్రజా ప్రతినిధులు, అధికారులు.
■ కరువైన పారిశుధ్యం పట్టించుకోని అధికారులు.
■ ప్రజాగ్రహానికి గురికాక తప్పదని ప్రజల హెచ్చరిక.
■ ఎఫ్ సి ఐ గేట్ నుండి వీర్లపల్లె మార్గంలో ధ్వంసమైన రోడ్లు.
( రామగుండం కార్పొరేషన్ స్పెషల్ రిపోర్ట్ )
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా )పెద్దపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామాలను, పట్టణాలను, మున్సిపాలిటీలను, కార్పొరేషన్లను, ఉన్నతంగా తీర్చిదిద్దే క్రమంలో రకరకాల పేర్లతో పల్లె ప్రగతి పట్టణ ప్రగతితో అభివృద్ధి వైపు గ్రామాలను తీసుకువెళ్లాలని సత్సంకల్పంతో కార్యక్రమాన్ని చేపట్టింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోని ఉన్నతంగా నిలిపిన కార్యక్రమాలలో ఒకటి పల్లె ,పట్టణ ప్రగతి అందుకు నిదర్శనం. గ్రామాల పట్టణాల ప్రగతి పైన కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా గత రెండు మూడు దఫాలుగా ప్రకటించిన అవార్డుల ఎంపికలో తెలంగాణ రాష్ట్రం నుండే అత్యధిక అవార్డులు గెలుచుకున్న సంగతి తెలిసిందే, ఇంతవరకు బాగానే ఉంది. నిజానికి పల్లె, పట్టణ ప్రగతి,కార్యక్రమాలు అధికారులు ప్రజా ప్రతినిధులు ,… ప్రజల భాగస్వామ్యంతో ……శ్రద్ధతో, చిత్తశుద్ధితో అంకితభావంతో, కార్యక్రమ విజయవంతానికి కృషి చేయాల్సిన బాధ్యత ఉన్నప్పటికీ , కొంతమంది అధికారుల, ప్రజాప్రతినిధుల, నిర్లక్ష్యం వైఖరితో పల్లె పట్టణ ప్రగతి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందనంగా తయారయింది.అని ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రజాప్రయోజన అభివృద్ధి కార్యక్రమాలు నిరంతర ప్రక్రియ అయినప్పటికీ కొందరు అధికారులు, ప్రజా ప్రతినిధులు, కార్యక్రమం యెడల కంకణ బద్ధులై పనిచేయడం లేదు. తద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఆశయ సాధనకు గండి కొట్టినట్లు అవుతుంది అనే విమర్శలు వ్యక్తం అవుతున్నాయి…. అందుకు నిదర్శనం రామగుండం కార్పొరేషన్…. రామగుండం కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్ పరిధిలో ఉన్న అంతర్గత రహదారులు నరకాన్ని తలపిస్తున్నాయి. నిత్యం వందలాది వాహనాలు వచ్చిపోయే ప్రధాన రహదారి అయిన ఎఫ్ సి ఐ గేటు అదేవిధంగా ఎఫ్ సి ఐ నుండి వీర్ల పల్లెకు వెళ్లే రహదారి గుంతల మాయమై ప్రత్యక్ష నరకాన్ని తలపిస్తుంది. విధ్వంసమైన రహదారులతో ప్రయాణికులు అష్ట కష్టాలు పడుతున్నారు. గుంతలమయమైన రోడ్లతో రోడ్డు కనిపించని పరిస్థితి దాపురించింది. ఎండగొడితే దుమ్ము, వర్షం పడితే బురదతో ప్రయాణికులు అగచాట్లు ఎదుర్కొంటున్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులు వెంటనే స్పందించి రోడ్డు మరమ్మత్తు కార్యక్రమాలు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేనట్లయితే రాబోయే రోజుల్లో తగిన మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరిస్తున్నారు.

పడకేసిన పారిశుధ్యం…..
రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురిసిన, కురుస్తున్న వర్షాలకి జనజీవనం అస్తవ్యస్తమై ఇప్పుడిప్పుడే కుదురుకుంటున్న విషయం తెలిసిందే. సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం పొంచి ఉందని గ్రహించి జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు, సాక్షాత్తు జిల్లాస్థాయి అధికారులు అయినా అదనపు కలెక్టర్ కుమార్ దీపక్ ,జిల్లా పంచాయతీ అధికారి చంద్రమౌళి, రంగంలోకి దిగి పారిశుద్ధ కార్యక్రమాలు పర్యవేక్షిస్తున్నప్పటికీ,………….. రామగుండం కార్పొరేషన్ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నారు. ప్రజల సమస్యలు తమకేమీ పట్టవు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు…. అధికారుల తీరుపైన ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 14వ డివిజన్లో పారిశుద్ధ్య కార్యక్రమంపైన ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు. సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ఉండేందుకు చెత్తను ఎప్పటికప్పుడు శుభ్రపరుస్తూ, నీటి నిల్వలు లేకుండా, చూస్తూ బ్లీచింగ్ , ఆయిల్ బాల్స్, చల్లుతూ దోమల నియంత్రణకు చర్యలు చేపట్టి పారిశుద్ధ్య కార్యక్రమాన్ని మెరుగుపరచాల్సిన అధికారులు తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు, అనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత ప్రాంత శానిటేషన్ శాఖ అధికారులు అటువైపుగా దృష్టి సారించి ప్రజలు రోగాల బారిన పడకుండా కాపాడాల్సిన బాధ్యత ఎంతైనా ఉంది.

