అగ్నిధార న్యూస్ (నస్పూర్)
నస్పూర్ మున్సిపాలిటీ నూతన కమిషనర్ గా సివిఎన్ రాజు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయ సిబ్బంది ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కమిషనర్ మాట్లాడుతూ మున్సిపల్ అభివృద్ధికి ప్రతి ఒక్కరు సహకరించాలని, పారిశుధ్యం పై ప్రత్యేక దృష్టి సారించాలని వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అధికారులు సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్ టి.రమేష్ ఆర్ వో లు కే.సతీష్ , భుజంగరావు, ఏఈ డి.మధు తదితరులు పాల్గొన్నారు.
