■ ఫ్లెక్సీ పై కనిపించని అధికార ప్రతిపక్ష ఎమ్మెల్యేల ఫోటోలు.
■ ఫ్లెక్సీ పై కనిపించని జడ్పీ చైర్ పర్సన్ ఫోటో.
■ అధికారుల అవగాహన లోపమా కావాలనే చేసుడా.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి జిల్లా) ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న దళిత బంధు యూనిట్ల పంపిణీ కార్యక్రమంతో పెద్దపల్లి జిల్లాలో మరోసారి బయటకు కనిపించకుండానే ఫ్లెక్సీ వివాదం చోటుచేసుకుంది .శుక్రవారం రోజు మంత్రి కొప్పుల ఈశ్వర్ చేతులమీదుగా అట్టహాసంగా ప్రారంభించిన, దళిత బంధు కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ, అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, లోకల్ బాడీ కలెక్టర్ కుమార్ దీపక్, తో పాటు జిల్లా స్థాయి అధికారులు, మండల స్థాయి అధికారులు, లబ్ధిదారులు హాజరయ్యారు. అదేవిధంగా జిల్లాలోనిఅధికారపక్ష ప్రజాప్రతినిధులు అయినా పెద్దపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ పుట్ట మధుకర్ హాజరై ప్రసంగించారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ దళిత బంధు కార్యక్రమాన్ని ఉద్దేశించే వేదిక వెనుకాల వెలిసిన ఫ్లెక్సీ పైన పెద్దపల్లి నియోజకవర్గ స్థానిక శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి, రామగుండం ఎమ్మెల్యే కోరు కంటి చందర్, అదేవిధంగా పెద్దపల్లి జిల్లా పరిషత్ చైర్పర్సన్ పుట్ట మధుకర్, ఫోటోలు ముద్రించకపోవడంతో కార్యక్రమానికి హాజరైన వారు ఒక్కసారిగా ఖంగుతున్నారు. మరోసారి ఫ్లెక్సీ రగడ ,ప్రోటోకాల్ మిస్సయ్యారు, అనే గుసగుసలు వినిపించాయి. ఇది ఎవరి తప్పిదం వల్ల జరిగినా, కార్యక్రమానికి హాజరైన ప్రజాప్రతినిధులను అగౌరపరిచినట్లు అయిందని నాయకుల….. అభిమానులు, ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి హాజరైన ప్రజా ప్రతినిధులు మనసులో బాధను పెట్టుకొని బయటకు కనబడకుండా ప్రసంగించినట్లు అనిపించింది. ఈ విషయంపై కొందరు కార్యకర్తలు సంబంధిత శాఖ ఉన్నతాధికారులను నిలదీసి నిరసన తెలిపినట్లు విశ్వాసనీయ సమాచారం. ఏదేమైనా జడ్పీ చైర్ పర్సన్, అదేవిధంగా జిల్లాలోని … ప్రతిపక్షం ,పాలకపక్షం అనే తేడా లేకుండా అందరి ఎమ్మెల్యేల ఫోటోలు ముద్రించడం ప్రోటోకాల్ అని పలువురు అంటున్నారు.
