■  పోరెడ్డి దామోదర్ రెడ్డి టీ. పి. టి ఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు డిమాండ్.

అగ్నిధారన్యూస్( కరీంనగర్ ) 317ను ఏకపక్షంగా అమలు చేసిన ప్రభుత్వం నష్టపోయిన సాధారణ ఉపాధ్యాయుల అప్పీల్స్ ను పరిష్కరించకుండా తాత్సారం చేస్తూ, పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలు నిర్వహించటం అధికార దుర్వినియోగమేనని టీపీటీఫ్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు పోరెడ్డి దామోదర్ రెడ్డి , ప్రధాన కార్యదర్శి ఆర్ చంద్ర శేఖర్ రావు ఒక ప్రకటన లో విమర్శించారు.మహబూబ్ నగర్ నుండి నారాయణ పేటకు కెటాయించబడిన పైరవీ బదిలీలను నిలిపివేయాలని లోగడ అక్రమ బదిలీలు జరిగినవియాని. కొందరికి అనారోగ్యం అని అంతర్జిల్లా డెప్యుటేషన్లు వేస్తున్నారు.జిఓ 317 అమలు కారణంగా నష్టపోయిన జూనియర్ ఉపాధ్యాయులు, భార్యాభర్తలు తదితర అర్హతగలిగిన సాధారణ ఉపాధ్యాయుల అప్పీల్స్ పరిష్కరించకుండా, బదిలీలు, పదోన్నతుల షెడ్యూల్ విడుదల చేయకుండా పలుకుబడి కలిగిన వారికి పైరవీ బదిలీలు చేయటం, డెప్యుటేషన్లు ఇవ్వటం అత్యంత దుర్మార్గం.స్పౌజ్ బదిలీలకు బ్లాక్ చేసిన జిల్లాలకు ఏ ప్రత్యేక ప్రాధాన్యత లేని అత్యంత జూనియర్లైన ఉపాధ్యాయులను బదిలీ చేయటం రాష్ట్ర ప్రభుత్వ అధికార దుర్వినియోగమేనని అన్నారు .
అక్రమ బదిలీలు, పైరవీ బదిలీలను రద్దు చేసి సాధారణ బదిలీలు, పదోన్నతుల షెడ్యూలును తక్షణమే విడుదల చేయాలని, డిమాండ్ చేశారు.