■ ప్రమాదకరంగామారిన బావి పట్టించుకోని అధికారులు.
■ ప్రమాద అంచుల్లో భావి ఆదమరిస్తే అధోగతి.
■ తృటిలో తప్పిన పెను ప్రమాదం.
■ కానరాని హెచ్చరిక బోర్డు.
■ భావి ఉన్న విషయం కూడా తెలియదు.
■ ప్రమాదం జరగకముందే అధికారులు అప్రమత్తం కావాలి.
■ బావిని పూడ్చాలని ప్రయాణికుల డిమాండ్.
అగ్నిధారన్యూస్( పెద్దపల్లిజిల్లా ) తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాజీవ్ రహదారి అదేవిధంగా వివిధ గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారుల వెంట ఉన్న వ్యవసాయ బావిలలో ద్విచక్ర వాహనాలు స్కూల్ బస్సులు కార్లు ఇతరత్రా వాహనాలు ప్రమాదవసత్తు పడి ప్రజలు మృతి చెందిన సంఘటనలు అనేకం సంఘటన జరిగిన సందర్భంలో మాత్రమే అధికారులు రోడ్డు పక్కన ఉన్న బావులను పూడ్చి వేయాలని హడావిడి చేసి చేతులు దులుపుకుంటున్న సంఘటనలు మనకు కనబడుతున్నవే, అయినప్పటికీ పెద్దపల్లి జిల్లాలో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే రహదారుల వెంట ఇప్పటికి అక్కడక్కడ వ్యవసాయ బావులు రోడ్డు పక్కనే దర్శనమిస్తున్న సంఘటనలు చాలానే ఉన్నాయి రహదారి వెంట ప్రమాదపు అంచుల్లో ప్రయాణికులు సంవత్సరాలుగా కాలంవెళ్లదీస్తున్నారు. పెద్దపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో కొత్తపల్లి నుండి కొలనూరు వెళ్లే మార్గంలో కొత్తపల్లి మూసివేసిన రైల్వే గేటు నుండి కొలనూర్ వైపు కొద్ది దూరం వెళ్లగానే ఒక మూల మలుపు దర్శనమిస్తుంది. పక్కనే వ్యవసాయ బావి గడ్డి గాదంతో కప్పబడి ప్రయాణికులకు కనిపించకుండా నిండుకుండలా నీళ్లతో నిండి ప్రమాదకరంగా మారిన భావిని చూసి అటువైపు వెళ్లే ప్రయాణికులను బంబేలెత్తిస్తుంది. ఏ మాత్రం ఆదమరిచి అదుపుతప్పి డ్రైవింగ్ చేసినట్లయితే ఆ బావిలో పడి ప్రాణాలు పోవడం ఖాయం అనే సంకేతాలు కండ్ల ముందే కనబడుతున్నాయి. నిత్యం ఈ దారి వెంట వందలాది వాహనాలు ఓదెల, సుల్తానాబాద్, కాల్వ శ్రీరాంపూర్, మండలాలకు చెందిన ప్రజలు విద్యార్థులు రాకపోకలు పెద్దపల్లి జిల్లా కేంద్రానికి సాగుతూ ఉంటాయి.నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో ఎదురుగా వస్తున్న ఒక వాహనాన్ని తప్పించబోయి పక్కనే ఉన్న వ్యవసాయ బావి వైపు ద్విచక్ర వాహనం దూసుకుపోగా వెంటనే అప్రమత్తమైన ద్విచక్ర వాహనదారుడు క్షణాల్లో బావిలో పడకుండా తప్పించుకున్న సంఘటన ఒక్కసారిగా భయాందోళన రేపింది. ప్రమాద భరితంగా మారి రహదారి పక్కనే ఉన్న ఈ భావిని పూడ్చివేయాలని ప్రయాణికులు అధికారులను కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖ ఆర్ అండ్ బి ఉన్నతాధికారులు అధికారులు స్పందించి ఎలాంటి ప్రమాదం జరగకముందే, ప్రయాణికులకు ప్రమాదకరంగా మారిన ఆ బావిని పూడ్చివేయాలని వాహనదారులు డిమాండ్ చేస్తున్నారు.


