అగ్నిదారన్యూస్ ,(రామగుండం): సభ్య సమాజం తలదించుకునేలా కట్టుకున్న భార్య భర్తను గొంతు నలిపి హత్య చేసిన సంఘటన గోదావరిఖని ఎన్టీపీసీ ఆటోనగర్ లో కలకలం సృష్టిస్తుంది. వివరాల్లోకి వెళ్తే… ఆటో నగర్ లో నివాసం ఉండే అజీమ్ ఖాన్, శ్రావణి లు 8 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. గత కొన్ని రోజులుగా భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే భార్య భర్తల మధ్య మరోసారి ఈ రోజు ఘర్షణ జరగడంతో భార్య శ్రావణి భర్త గొంతు నలిపి హత్య చేసినట్లు తెలుస్తుంది. ఈ హత్యతో అనేక అనుమానాలు వెలువెత్తుతున్నాయి. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని వివరాలు సేకరించారు. ప్రస్తుతం మృతుడి భార్యను పోలీసులకు అదుపులోకి తీసుకున్నారు.? ఎన్ టి పి సి ఎస్ ఐ జీవన్ కేసు నమోదు చేసుకొని దర్యాప్తు ప్రారంభించారు.
