అగ్నిధారన్యూస్( ఓదెల ) శనివారం తెలంగాణ జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలలో భాగంగా పెద్దపల్లి జిల్లా ఓదెల మండల పరిషత్ కార్యాలయంలో జాతీయజెండాను ఎంపీపీ రేణుక ఆవిష్కరించి మాట్లాడుతూ… 17 సెప్టెంబర్ 2022 నాటికి హైదరాబాద్ సంస్థానం భారతదేశంలో విలీనం అయి 75 వసంతాలు పూర్తవుతున్న సందర్భంగా తెలంగాణ ప్రజల పోరాటపటిమ, సాంప్రదాయాలు,రాష్ట్ర అభివృద్ది, సంక్షేమం ఘనంగా చాటేలా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సావాలను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏం ఆర్ ఓ రమేశ్,ఎంపీడీఓ సత్తయ్య నాయకులు టిఆర్ఎస్ యూత్ మండల అధ్యక్షుడు మ్యాడగోని శ్రీకాంత్ గౌడ్,వెంకటస్వామి, పోశెట్టి, మరియు అధికారులు తదితరులు పాల్గొన్నారు.

