అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లిజిల్లా) పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం మడక  నుండి గుంపుల వరకు  ఓవర్ లోడ్ ఇసక రవాణా ద్వారా రోడ్లు మొత్తం ధ్వంసమై ప్రమాదకరమైన పరిస్థితికి చేరుకున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలో వైఫల్యం చెందారని ఓదెల జడ్పిటిసి  గంట రాముల యాదవ్ ఆరోపించారు. ఆయా ప్రాంతాలలో స్పీడ్ బ్రేక్ లు..హెచ్చరిక బోర్డులు. లేక ప్రజలు ప్రమాదాల భారిన పడుతున్నారని,అయిన పట్టిచుకున్న పాపాన పోయిన వారెలేరని ధ్వజమెత్తారు. పెద్దపల్లి ఎంపీ బోర్లకుంట వెంకటేష్  కల్పించుకొని ప్రజల రాకపోకలకు ఇబ్బందికరంగా మారిన చర్యలు వెంటనే ఆపేయాలని అధికారులను ఆదేశించారు. రహదారి నిర్మాణం  పూర్తి అయ్యే వరకు ప్రత్యామ్నాయ మార్గాలకు చర్యలు చేపట్టాలన్నారు. మంజూరు అయిన రహదారి పనులు ఎన్ని రోజుల్లో పూర్తి అవుతుందని అధికారులను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా తాత్కాలిక మరమ్మతులు,హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్ల, నిర్మాణాలకు కోసం ఎంపీ నిధుల నుండి లక్ష రూపాయలు మంజూరు చేస్తున్నట్టు  ఎంపీ తెలిపారు.