అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి జిల్లా) ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రామగుండంలోని ఆర్ ఎఫ్ సి ఎల్ ను,6,500 కోట్ల రూపాయలతో పున:ప్రారంభించి జాతికి అంకితం చేశారు . ఆర్ ఎప్ సి ఎల్ ప్రారంభించి తిరుగు ప్రయాణంలో ప్రధాన మంత్రి మోడీకి వీడ్కోలు పలకడంలో పెద్దపెల్లి మండలం బొంపల్లి గ్రామానికి చెందిన బి జె వై యం రాష్ట్ర కార్యదర్శి దాడి సంతోష్ కి అరుదైన అవకాశం లభించినది . ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో మూతపడిన ఆర్ఎఫ్సిలను బిజెపి ప్రభుత్వం తిరిగి ప్రారంభించడం ద్వారా తెలంగాణలోని రైతులకే కాకుండా భారతదేశంలోని రైతులందరికీ లాభం జరుగుతుందని అన్నారు . సాధారణ కార్యకర్తను అయిన నాకు దేశ ప్రధానమంత్రి నరేంద్రమోడీ ని కలవడానికి సహకరించిన బిజెపి రాష్ట్ర శాఖకు , రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కుమార్ కి , ప్రదీప్ కుమార్ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను అన్నారు . మోడి ని కలిసిన ఉత్సాహంతో పెద్దపెల్లి అసెంబ్లీలో బిజెపి పట్టిష్టత కోసం పనిచేస్తానని అన్నారు.
