■ నిండు ప్రాణాన్ని బలిగొన్న వడ్ల ధాన్యం కుప్ప
అగ్నిధార న్యూస్ (తలకొండపల్లి)
తలకొండపల్లి మండల కేంద్రానికి చెందిన జూలపల్లి మల్లేష్,నిండు ప్రాణాన్ని బలిగొన్న వడ్ల కుప్ప ఘటన మిడ్జిల్ మండలంలోని వేముల గేట్ సమీపంలో జరిగింది.మండల కేంద్రాన్ని చెందిన జూలపల్లి మల్లేష్(35) అనే యువకుడు రోడ్డుపై ఉన్న వడ్ల కుప్పను గమనించకుండా బైక్ పై వచ్చి ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందాడు.కుటుంబ సభ్యులు,స్థానికుల కథల మేరకు వివరాలు ప్రకారం.. ఆదివారం మధ్యాహ్నం ప్రాంతంలో మిడ్జిల్ మండలంలోని చిలివేరు గ్రామానికి ఎంగేజ్మెంట్ నిమిత్తం వెళ్లి తిరిగి రాత్రి 8:00గంటల ప్రాంతంలో తలకొండపల్లి గ్రామానికి వస్తున్న క్రమంలో.. వేముల గేటు సమీపంలోని శంకరమ్మ గుడి దగ్గర చేరుకోగానే ఎదురుగా వస్తున్న కారు లైట్ ఫోకస్ కు,వరి ధాన్యం కుప్పను గమనించకుండా కుప్ప పైకి బైకు ఎక్కించడం తో కింద పడి అక్కడికక్కడే మృతి చెంది ఉంటాడని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.ధాన్యం పై నల్లటి తార్పాలిన్ కవర్ కప్పి ఉండటంతో రోడ్డు అనుకుని కుప్ప పైకి ఎక్కి ఉంటాడని కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.మృతుడు మల్లేష్ కు భార్య మాధవి,ఒక కుమారుడు,కూతురు ఉన్నట్లు తెలిపారు.రోడ్లపై ఎక్కడపడితే అక్కడ ధాన్యం కుప్పలు పేరుకు పోయిన సంబంధిత అధికారులు కనీసం పట్టించుకోవడంలేదని మృతుని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కల్వకుర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు,కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

