■  బియ్యం సరఫరా లో తీవ్ర నిర్లక్ష్యం.

■  విచారణ చేపట్టి కలెక్టర్ కి నివేదిక ఇచ్చిన అధికారి.

■  గోడౌన్ ఇంచార్జీ అమృత్ కుమార్ సస్పెన్షన్.

■  ఉత్తర్వులు జారీ చేసిన జిల్లా కలెక్టర్ సంగీత సత్యనారాయణ.

అగ్నిధార న్యూస్( పెద్దపల్లి) పెద్దపల్లి జిల్లా
పెద్దపల్లి ఎం.ఎల్.ఎస్ పాయింట్ గోడౌన్ ఇంచార్జీ అమృత్ కుమార్ (డి.సి.ఎస్.ఓ సీనియర్ అసిస్టెంట్) ను సర్వీస్ నుంచి సస్పెండ్ చేస్తూ సోమవారం జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్. సంగీత సత్యనారాయణ  ఉత్తర్వులు జారీ చేశారు.

రామగుండం మండలానికి చెందిన రేషన్ షాపుల సంఖ్య 3612008, 3612009, 3612010, 3612011, 3612013, 3612015, 3612017, 3612040, 3612043 కు చెందిన డీలర్లు సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో డిసెంబర్ నెలకు సంబంధించిన బియ్యం సరఫరా తమ రేషన్ షాపులకు జర్గలేదని కలెక్టర్ కు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదుపై జిల్లా పౌర సరఫరాల అధికారి విచారణ నిర్వహించారు. రామగుండం మండలంలోని రేషన్ షాపులకు బియ్యం సరఫరా చేయడంలో సీనియర్ అసిస్టెంట్ గోడౌన్ ఇంచార్జ్ అమృత్ కుమార్ తీవ్ర నిర్లక్ష్యంతో వ్యవహరించినట్టుగా గుర్తించడం జరిగిందని, ప్రతి నెల 5 తారీఖు కంటే ముందు బియ్యం సరఫరా చేయాల్సి ఉండగా ఇప్పటివరకు జరగలేదని తెలుపుతూ, అమృత్ కుమార్ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా పరిగణించిన జిల్లా కలెక్టర్ ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.