■  సమస్యలు ఉంటే చట్టపరంగా పరిష్కరించుకోవాలి.

■  చట్టాన్ని అతిక్రమిస్తే కఠిన చర్యలు తప్పవు.

■  ఉద్రిక్తతలను ప్రోత్సహించే వారి పైన డేగ కన్ను.

■  ప్రజల స్వేచ్ఛను హరిస్తే సహించేది లేదు.

పెద్దపల్లి సీఐ ఎ. ప్రదీప్ కుమార్.

అగ్నిదార న్యూస్,( పెద్దపల్లి ) రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి పోలీస్ సర్కిల్ లో ప్రమాదంలో గాయపడిన లేదా చనిపోయిన బాధిత కుటుంబ సభ్యులు, సన్నిహితులు రహదారులపై ధర్నాలు రాస్తారొక లు నిర్వహిస్తూ అత్యవసర పరిస్థితుల్లో ఉన్నవారికి, వాహదారులకు, ప్రజలకు ఇబ్బందులు కలిగించేలా ప్రవర్తిస్తే చట్టపరమైన చర్యలు తప్పవని పెద్దపల్లి సీఐ ఎ. ప్రదీప్ కుమార్ శుక్రవారం ఓ ప్రకటనలో హెచ్చరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో బసంత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కుక్కల గూడూరు, పెద్దపల్లి పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాద బాధితుల కుటుంబ సభ్యులు , సన్నిహితులు నష్టపరిహారం కోసం కొంతమంది స్వార్థం  స్వలాభం పొందే వారి ప్రోద్బలంతో రోడ్లపైకి వచ్చి రాస్తారోకలు ధర్నాలు చేయడం జరిగిందని, ఇలాంటి కార్యక్రమాలు చేయడం వలన సాధారణ ప్రజలకి వాహనదారులకి ఇబ్బంది కలుగుతుంది తప్ప సమస్యలు పరిష్కారం కావు అన్నారు. బాధిత కుటుంబాలకు ఏదైనా నష్టం జరిగినప్పుడు సంబంధిత వ్యక్తులు  న్యాయం కావాలనుకుంటే  చట్టపరంగా కోర్టుల ను ఆశ్రయించి కోర్టు ఆదేశానుసారం న్యాయం పొందవచ్చు అన్నారు. అలాకాక ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించినట్లయితే చట్టపరమైన చర్యలు పవన్ హెచ్చరించారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రతి విషయాన్ని వీడియోలు ఫోటోలు తీసి వైరల్ చేసి, పేరు సంపాదించాలనే దురుద్దేశంతో సంఘటనకు సంబంధించిన బాధితులను వారి కుటుంబ సభ్యులను  సన్నిహితులను, ఉదేశపూర్వకంగా ప్రలోభాలకు, గురిచేసి ధర్నాలు రాస్తారోకోలు చేయడం వల్ల సమస్యలు పరిష్కారం అవుతాయి అని వారిని ప్రోత్సహించి, రోడ్లపై బైఠాయించే విధంగా ప్రేరేపిస్తున్నారు. ఇలాంటి చర్యలకు పాల్పడే కొంతమంది జాబితా సిద్ధం చేయడం జరిగింది అన్నారు.వారిపై త్వరలోనే చట్టమైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు. అదే విధంగా వీరి మాటలు విని ప్రజా జీవనానికి ఇబ్బంది కలిగించే విధంగా ప్రవర్తించే వారిపై కూడా చట్టపరమైన కేసులు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.