ధ్యానం మీద ద్యాసతో గొప్ప యాగం

■ ధ్యానం మనిషి ప్రశాంతతకు నిలయం

■ కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్

అగ్నిధార న్యూస్ తలకొండపల్లి(కడ్తాల్)మహేశ్వర మహా పిరమిడ్ ఔన్నత్యాన్ని ఈ సమాజానికి చాటి చెప్పుదామని కల్వకుర్తి శాసనసభ్యులు ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ పేర్కొన్నారు,బుధవారం రంగారెడ్డి జిల్లా కడ్తాల్ మండల కేంద్రంలో సుభాష్ పత్రీజీ స్థాపించిన మహా పిరమిడ్ ఆధ్వర్యంలో వేలాదిమంది ధ్యానులచే మహాయాగం మొదలైనది.ఈ సందర్భంగా ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ మాట్లాడుతూ 2010సంవత్సరంలో ప్రారంభమైన ఈ మహా పిరమిడ్ ధ్యాన మహాసభలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించాలని,వైభవోపేతంగా ధ్యాన‌ మహాసభలు జరుపుకోవాలని కొనియాడారు.సుభాష్ పత్రీజీ మరణం ధ్యాన ప్రియులను కలచివేసిందనీ ఆయన జ్ఞప్తికాలతో ఈ సంవత్సరం ధ్యాన‌ మహాయాగం జరుగుతుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు.మహనీయ పితా మహర్షి సుభాష్ పత్రీజీ భౌతికాయం మన మధ్యలో లేకున్నా ఆయన ఆత్మ ఎప్పుడు మనతోనే మనచుట్టే ఉంటుందని అన్నారు.దేశ విదేశాల నుండి వేలాదిమంది ధ్యాన ప్రియులు పాల్గొనడం అత్యంత గొప్ప విషయం అన్నారు.మహర్షి సుభాష్ పత్రీజీ స్థాపించిన కైలాసపూరి సౌభాగ్యంతో ధీపా నైవేద్యం సమర్పించడం జరిగింది.మహాయాగంలో పిరమిడ్ ప్రాంతంలో వేలాదిమందికి అన్ని సదుపాయాలు కల్పించే దిశగా ఏర్పాట్లు చేశామని ట్రస్ట్ సభ్యులు పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మహా పిరమిడ్ ట్రస్ట్ చైర్మన్ విజయ భాస్కర్ రెడ్డి,స్థానిక ఎమ్మెల్యే యాగం చైర్మన్ గుర్క జైపాల్ యాదవ్,కడ్తాల్ జెడ్పిటిసి దసరత్ నాయక్,సర్పంచ్ లక్ష్మీ నరసింహ రెడ్డి,గంప వేంకటేశ్,ట్రస్ట్ సభ్యులు బాలకృష్ణ,మాధవి శివప్రసాద్,రాంబాబు,కేశవరాజు,ఆమనగల్ సిఐ జాలా ఉపేందర్,వివిధ గ్రామాల సర్పంచులు,ఎంపిటిసిలు,రైతు సమన్వయ అధ్యక్షులు,సింగిల్ విండో డైరెక్టర్లు,వేలాదిమంది ధ్యానులు తదితరులు పాల్గొన్నారు.