■ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్ట్.
■ సిట్టింగులకి ఎమ్మెల్యే టికెట్ కెసిఆర్.
■ ఎమ్మెల్యే టికెట్ గురించి నాతో మాట్లాడలేదన్న కందుల సంధ్యారాణి.
■ అభిమానుల అత్యుత్సాహమే ఈ పని
✍️చేగొండ రవికుమార్ యాదవ్
అగ్నిధారన్యూస్( పెద్దపల్లి జిల్లా ) తెలంగాణ ఉద్యమ స్ఫూర్తితో వెలసిన టిఆర్ఎస్ పార్టీ దేశ రాజకీయాలలో సమూల మార్పులు తీసుకురావాలనే లక్ష్యంతో ఈనెల 14న బిఆర్ఎస్ పార్టీ దేశ రాజధాని ఢిల్లీ కేంద్రంగా రాజకీయాలలో చక్రం తింపాలనే లక్ష్యంతో పార్టీ కార్యాలయాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రారంభించారు. అట్టి కార్యక్రమానికి రాష్ట్రంలోని టిఆర్ఎస్ పార్టీ నాయకులు ప్రజా ప్రతినిధులు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు, అధిక సంఖ్యలో హాజరయ్యారు. ప్రారంభోత్సవ, యజ్ఞయాగాలంతరం అక్కడికి వచ్చిన ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్తతో, కెసిఆర్ సన్నిహితంగా ఉన్నారు.అడిగిన ప్రతి వారితో ఫోటోలు దిగారు. అక్కడ దిగిన ఫోటోలు కాస్త రాష్ట్రవ్యాప్తంగా ఆయా నియోజకవర్గాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ముఖ్యమంత్రితో ఫోటోలు దిగిన ఆశావాహుల అభిమానులు, సోషల్ మీడియాలో వారికి అనుకూలంగా, తమ నాయకులకే ఎమ్మెల్యే, ఎంపీ టికెట్, ఇస్తామన్నారని, కార్పొరేషన్ పదవి ఇస్తామన్నారని, రకరకాలుగా సోషల్ మీడియాలో బాణాలు వదులుతున్నారు. ఇది కాస్త పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో కెసిఆర్ ని, బిఆర్ఎస్ పార్టీ కార్యాలయ ఆవిర్భవ సందర్భంగా మర్యాదపూర్వకంగా కలిసి దిగిన ఫోటోతో, కందుల సంధ్యారాణి, కోలేటి దామోదర్ పేర్లు రాబోయే శాసనసభ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా ముఖ్యమంత్రి వీరు పేర్లు పరిశీలిస్తున్నట్లు, మహిళకు టికెట్టు ఇస్తే బాగుంటుంది, అని ఆలోచనలో ముఖ్యమంత్రి ఉన్నారన్నట్లు, అభిమాని ఒకరు చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో రామగుండం నియోజకవర్గంలో చెక్కర్లు కొడుతుంది. గత రెండు నెలల క్రితం ముఖ్యమంత్రి స్వయంగా టిఆర్ఎస్ రాష్ట్ర పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ఎమ్మెల్యేల సమావేశంలో సిట్టింగులకె మళ్లీ సీట్లు కేటాయిస్తామని స్వయంగా ప్రకటించారు. ఈ లెక్క ప్రకారం టిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు, రామగుండం సిట్టింగ్ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కి మళ్లీ రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే టికెట్ ఇస్తారు అనేది తేలిపోయింది.ఆదిశగా ఆయన అభిమానలు సోషల్ మీడియాను వాడుతున్నారు.రామగుండంలో ఆశావాహుల అభిమానులు చేస్తున్న హడావిడి ఎవరికి మేలు చేస్తుందో ఎవరికి కీడు చేస్తుందో తెలియదు కానీ, రామగుండం నియోజకవర్గంపైన టిఆర్ఎస్ పార్టీ అధిష్టానం జరుగుతున్న పరిణామాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తుంది.ఎవరైన పార్టీ గీత దాటే వేటు తప్పదని నాయకులను హెచ్చరించినట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి

FAKE NEWS
