అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
■ చిన్న వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు.
■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు.
■ ఊరికి ఏదో చేయాలనే తపన ఉన్నతంగా నిలిపింది.
■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు.
■ ఉద్యోగం చేస్తూ జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు.
■ 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు, ప్రభుత్వం ఆమోదించలేదు.
■ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వి. లక్ష్మినారాయణ.
*చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార ఎడిటర్*
*అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా )* నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ నేటి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం, అప్పారెడ్డి పల్లె గ్రామానికి చెందిన సామాన్య కుటుంబంలో, జన్మించి కులవృత్తినే ప్రధాన జీవనాధారంగా జీవితం సాగిస్తున్న కుటుంబంలో, బుచ్చన్న, మణెమ్మ పుణ్య దంపతులకు మొదటి సంతానంగా వి. లక్ష్మీనారాయణ జన్మించారు. ఒక తమ్ముడు, ముగ్గురు అక్క చెల్లెలు, భార్య ఇద్దరు కుమారులతో, అది ఒక అందమైన,ఆదర్శవంతమైన కుటుంబం.పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది,అనే సామెత, లక్ష్మీనారాయణకు కరెక్ట్ గా సరిపోతుంది. ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని, తన పుట్టి పెరిగిన పరిసరాలపై మక్కువతో తన మనసులో చిన్ననాడే సంకల్పింప చేశాయి. ఊరికి ప్రజలకి ఏదో చేయాలనే తపన నిత్యం తనను వెంటాడేది. 1981లో పదవ తరగతి పూర్తి చేశారు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ,పీజీ అనంతరం, ఏం ఫీల్ పూర్తి చేసి,1991నుండి 1994వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రైవేట్ లెక్చరర్ గా పిల్లలకు విద్యాబోధనని అందించారు. తనని కనిపెంచిన తల్లిదండ్రులను ఎంతగా ఇష్టపడతాడో, ఉన్న ఊరు అన్న ,ఆప్రాంత ప్రజలు అన్న అంతే అమితమైన ప్రేమ చూపేవారు. చదువుకునే వయసులోనే ఊరికి ఏదో చేయాలని కోరిక తన మదిని ఎప్పుడు వెంటాడుతూనే ఉండేది. చదువుతోపాటు సమాజ సేవ చేయాలని సంకల్పించి ,ఊరిలో యువజన సంఘాన్ని స్థాపింపచేసి తను అనుకున్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.1985 లోని తన ఊరికి మంచినీటి సౌకర్యం కోసం నాటి జడ్పీ చైర్ పర్సన్ గోపాల్ రెడ్డి ని ఒప్పించి తన గ్రామానికి రెండు లక్షల ఐదువేయిల రూపాయల నిధులను మంజూరు చేయించి, గ్రామంలో ఇంటింటికి నల్ల వేయించారు. అదేవిధంగా ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలని సంకల్పించి ఊరిని స్వచ్ఛత వైపు ముందుకు నడిపించారు.గ్రామంలో ప్రతి విద్యుత్ స్తంభాన్ని కాంతులతో ఊరు వాడ వెలిగించారు.గ్రామాన్ని 1994లో గుడిసెలేని గ్రామంగా తీర్చిదిద్దడానికి కృషి చేశారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నాటినుండి పార్టీలో క్రియాశీలకంగా పని చేశారు. తెలుగుదేశం పార్టీ , నందమూరి తారక రామారావు అంటే లక్ష్మీనారాయణకు అమితమైన ప్రేమ అందుకే ఎన్టీఆర్ కి అత్యంత సన్నిహితుడిగా, అంతరాంగికుడిగా ఉండేవారు. అదే స్థాయిలో ఎన్టీఆర్ వద్ద తనకు గుర్తింపు ఉండేది. అదే స్ఫూర్తితో రెట్టింపు ఉత్సాహంతో యువతతో కలిసి ప్రజా చైతన్య కార్యక్రమాలు చేపట్టారు. చిన్ననాడే తన గ్రామాన్ని దత్తత తీసుకున్నాడని చెప్పక తప్పదు. గ్రామ సర్వతోన్నాభివృద్ధిలో పాల్గొని ,గ్రామంలోని ఆనాడే ప్రజలకు శ్రీమంతుడు అయ్యారు.
*ఉద్యోగం బాధ్యత*
ప్రజలే దేవుళ్ళుగా ,ప్రజా సమస్యలే తన సమస్యలు అనుకొని, ప్రజాసేవ చేస్తున్న లక్ష్మీనారాయణకు, తన ప్రజలకు మరింత సేవ చేసే అవకాశం ప్రభుత్వ ఉద్యోగం రూపంలో వచ్చింది. 1994 ఫిబ్రవరి మాసంలో ఏఎస్ఓగా ఉద్యోగం సాధించారు. 1995లో గ్రూప్ టు పరీక్షలో ఉత్తీర్ణత కావడం చేత రెవెన్యూ శాఖలో డిప్యూటీ తాసిల్దారుగా, ఉద్యోగ బాధ్యతలు చేపట్టారు. తరువాత 1996,1998 సంవత్సరాలలో మహబూబ్ నగర్ జిల్లా, అడ్డాకుల ఎమ్మార్వో గా, అటు తరువాత కొంతకాలానికి వనపర్తి ఆర్డిఓ ఆఫీస్ లో ఏవోగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కలెక్టరేట్ లో ఏవోగా, 2015 నుంచి2018 వరకు మహబూబ్ నగర్ జిల్లా ఆర్డీవో గా, సీఈఓగా వివిధ హోదాల్లో విధులను నిర్వర్తించారు. ఆసమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలోని అన్ని మండలాల, నియోజకవర్గ, ప్రజలతో ప్రజాప్రతినిధులతో, బలమైన అవినాభావ సంబంధాలు ఏర్పడ్డాయి. చిన్ననాడు గ్రామానికి సేవ చేసే అవకాశం రావడం అదృష్టంగా భావించిన అతనికి, పెద్దయ్యాక జిల్లాకి,జిల్లా, ప్రజలకి సేవ చేసే అవకాశం రావడం తన జీవితంలో నేటికీ మరిచిపోలేదు. చిన్ననాడు తన ఊరి ప్రజలకి ధైర్యంగా, ఉద్యోగం చేస్తున్న సమయంలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజలకు ఒక ధైర్యంగా ఉంటూ. విధి నిర్వహణలో రెట్టింపు ఉత్సాహంతో ప్రజలకు సేవ చేయడంతో నిత్యం అధికారుల, ప్రజల, ప్రజాప్రతినిధుల మన్నులను పొందేవారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా ఒక మంచి అధికారిగా ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్నారు. ప్రజలకు మరింత సేవ చేయాలని సత్సంకల్పంతో 2018లో తను చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేశారు. కానీ ప్రభుత్వం ఆమోదించకపోవడం చేత 2019లో మళ్లీ ఉద్యోగంలో చేరి జాయింట్ డైరెక్టర్ భూభారతి లో పనిచేశారు. తరువాత 2020 ఫిబ్రవరి 12వ తేదీన పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన నాటి నుండి, నేటి వరకు, పెద్దపల్లి జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, అధికారులకి,
*అతనే ఒక ధైర్యం*
పెద్దపల్లి జిల్లాలో బాధ్యతలు చేపట్టిన నాటి నుండి నేటి వరకు జిల్లా ప్రజల మన్ననలు పొందుతున్నారు. ఒక మంచి అధికారిగా ప్రజల మదిలో చెరగని ముద్ర వేసుకున్నారు. నిత్యం జిల్లా కలెక్టరేట్ కు వివిధ సమస్యలపై వచ్చి పోయే ప్రజలకు అతనే ఒక ధైర్యంగా నిలుస్తున్నారు. సమస్య ఏదైనా పరిష్కార మార్గం అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ ను కలిస్తే దొరుకుతుందని అతి సామాన్యుడికి కూడా చేరువైంది. జిల్లా అదనపు కలెక్టర్ అంటే మామూలుగానే హంగులు ఆర్భాటాలు ఎక్కువగా ఉంటాయి, తనను కలవాలి అంటే చిట్టీలు రాసి పర్మిషన్ తీసుకోవాలి. కానీ అదరపు కలెక్టర్ లక్ష్మీనారాయణ కలవాలి అంటే ఏచిట్టి అవసరం లేదు. ఏ ఫైరవి అవసరం లేదు. నేరుగా బాధితుడే వచ్చి బాధ చెప్పుకుంటే సరిపోతుంది.
*ప్రజలకె కాదు ప్రజా ప్రతినిధులకు కూడా అతనే ధైర్యం*
జిల్లాలో గ్రామస్థాయి నాయకుడు మొదలుకొని, మండల, నియోజకవర్గ ,జిల్లా స్థాయి, అధికార ప్రతిపక్ష నాయకులెవరైనా సరే అందరికీ అతనంటే ఒక ధైర్యం వివిధ రకాల ప్రజా సమస్యలపై తన కార్యాలయానికి వచ్చేవారికి అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ అంటే మా అధికారి అనే ఒక ధైర్యంతో వస్తారు. ఎందుకంటే తన వద్దకి సమస్యల పైన వచ్చిన వారితో ఆప్యాయంగా మాట్లాడుతూ… వచ్చిన వారు చెప్పే సమస్యలకు పరిష్కరించడంలో, పరిష్కారం కాని వాటిని పరిష్కార మార్గం చూపడంలో తను చూపే శ్రద్ధ ఆసక్తులు తన వద్దకు వచ్చిన వారిని సంబ్రహ్మచర్యలకు గురిచేస్తాయి.
*అధికారులకి ఒక ధైర్యం*
నిత్యం ప్రజా సమస్యలు పరిష్కరించడంలో, అధికార ,ప్రతిపక్ష, ప్రజాప్రతినిధులు, వివిధ పార్టీల నాయకుల సందర్శనతో తన కార్యాలయం క్షణం తీరిక లేకుండా బిజీబిజీగా ఉంటుంది. అయినప్పటికీ వివిధ శాఖల అధికారులు తన వద్దకు తెచ్చే పరిపాలనపరమైన ఫైల్స్ కానీ ఇతర ఫైల్స్ ఏమాత్రం పెండింగ్ లో పెట్టకుండా, ఎప్పటి సంతకాలు అప్పుడు పెట్టడంతో అధికారులు అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ దగ్గరికి ఏ ఫైల్స్ తో వెళ్లిన నాలుగు సార్లు కార్యాలయం చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు, అనే ఒక ధైర్యం ఉంటుంది. అధికారులకి ఉద్యోగ పరమైన సమస్యలు వచ్చినప్పుడు పరిష్కారం మార్గం చూపడంలో “తనకు తానే సాటి .ఏదేమైనా పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ గా పని చేస్తున్న లక్ష్మీనారాయణ అంటే నిత్యం కదులుతున్న ఒక విజ్ఞాన బండాగారంగా చెప్పవచ్చు. తనకు అన్ని శాఖల పరిపాలన పైన ఉన్న పట్టుతో, ప్రజా సమస్యల పరిష్కరించడంలో తనకు తానే దిట్ట. రాబోయే రోజుల్లో ప్రజలకు మరింత గొప్పగా సేవ చేసే అవకాశం కలగాలని అగ్నిధార మనస్ఫూర్తిగా కోరుకుంటుంది.
