అగ్నిధార స్పెషల్ రిపోర్ట్
■ చదువుకునే వయసులోనే యువజన సంఘాన్ని స్థాపించారు.
■ చదువుకునే వయసులోనే ఊరిలో వెలుగులు నింపారు.
■ ఊరికి ఏదో చేయాలని తప్పని ఉన్నతంగా నిలిపింది.
■ నందమూరి తారక రామారావు అంతరంగికుడిగా పనిచేశారు.
■ ఉద్యోగం చేస్తూ జిల్లా ప్రజలకు దగ్గరయ్యారు.
■ 2018లో ఉద్యోగానికి రాజీనామా చేశారు,కానీ ప్రభుత్వం ఆమోదించలేదు.
■ పెద్దపల్లి జిల్లా అదనపు కలెక్టర్ వి. లక్ష్మినారాయణ
■ చేగొండ రవికుమార్ యాదవ్ అగ్నిధార ఎడిటర్.
అగ్నిధారన్యూస్ ( పెద్దపల్లి జిల్లా ) నాటి ఉమ్మడి మహబూబ్ నగర్ నేటి వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డి పల్లె గ్రామానికి చెందిన సామాన్య కుటుంబంలో జన్మించి కులవృత్తినే ప్రధాన జీవనాధారంగా జీవితం సాగిస్తున్న కుటుంబంలో బుచ్చన్న, మణెమ్మ పుణ్య దంపతులకు మొదటి సంతానంగా వి. లక్ష్మీనారాయణ జన్మించారు. ఒక తమ్ముడు, ముగ్గురు అక్క చెల్లెలు, భార్య ఇద్దరు కుమారులతో, అది ఒక అందమైన,ఆదర్శవంతమైన కుటుంబం. పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది,అనే సామెత, లక్ష్మీనారాయణకు కరెక్ట్ గా సరిపోతుంది. ఉన్న ఊరికి కన్న తల్లిదండ్రులకి మంచి పేరు తీసుకురావాలని తన పుట్టి పెరిగిన పరిసరాలపై మక్కువతో తన మనసులో చిన్నప్పుడే సంకల్పింప చేశాయి. ఊరికి ప్రజలకి ఏదో చేయాలనే తపన నిత్యం వెంటాడేది 1981లో పదవ తరగతి పూర్తి చేశారు. తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ ,పీజీ అనంతరం, ఏం ఫీల్ పూర్తి చేసి,1991నుండి 1994వరకు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో, ప్రైవేట్ లెక్చరర్ గా పిల్లలకు విద్యాభ్యాసాన్ని అందించారు. తనని కనిపించిన తల్లిదండ్రులను ఎంతగా ఇష్టపడతాడో, ఉన్న ఊరు అన్న ,ఆప్రాంత ప్రజలు అన్న అంతే అమితమైన ప్రేమ చూపేవారు. చదువుకునే వయసులోనే ఊరికి ఏదో చేయాలని తపన తన మదిలో ఎప్పటికీ వెంటాడుతూనే ఉండేది. చదువుతోపాటు సమాజ సేవ చేయాలని సంకల్పించి ,ఊరిలో యువజన సంఘాన్ని స్థాపింపచేసి తను అనుకున్న కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.1985 లోని తన ఊరికి మంచినీటి సౌకర్యం కోసం ఆనాడే నాటి జడ్పీ చైర్ పర్సన్ గోపాల్ రెడ్డి ని ఒప్పించి తన గ్రామానికి రెండు లక్షల ఐదువేయిల రూపాయలు మంజూరు చేయించి ,ఇంటింటికి నల్ల వేయించారు. అదేవిధంగా ఇంటింటికి మరుగుదొడ్డి ఉండాలని సంకల్పించి ఊరిని స్వచ్ఛత వైపు ముందుకు నడిపించారు.గ్రామంలో ప్రతి విద్యుత్ స్తంభాన్ని కాంతులతో ఊరు వాడ వెలిగించారు. ఎన్ని అవాంతరాలు వచ్చినా ధైర్యంగా నిలిచాడు. పూర్తి వివరాలు రేపటి అగ్నిధార పత్రికలో చూడగలరు.


