అగ్నిధారన్యూస్, ( మంచిర్యాల )
మంచిర్యాల జిల్లా కేంద్రంలోని గోదావరి నది ఒడ్డున స్వయంగా వెలిసిన శ్రీ గాయత్రీ మాత దేవి ఆలయ 16వ వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు చల్లా శ్రీనివాస్ దంపతులు ఆధ్వర్యంలో వేద పండితులు వామనభట్ల బాలకృష్ణ శర్మ వెంకటరమణలు ఆలయ వార్షికోత్సవం సందర్భంగా ప్రత్యేక పూజలతో పాటు హోమాది కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వేద పండితులు వామనభట్ల బాలకృష్ణ శర్మ మాట్లాడుతూ గాయత్రి మాత ఆలయాలు దేశంలో చాలా అరుదుగా ఉంటాయని చాలా అమ్మవారు శక్తివంతురాలు అని, సుదూర ప్రాంతాల నుండి అమ్మవారికి చాలామంది భక్తులు ప్రజాప్రతినిధులు ప్రతిరోజు ఇక్కడికి వచ్చి దర్శించుకుంటారని ఇక్కడకు వచ్చిన అమ్మవారిని దర్శించుకుంటే కొంగు బంగారం అవుతుందని ఆయన తెలిపారు. ఆలయ వార్షికోత్సవం సందర్భంగా భక్తులకు తీర్థప్రసాదాలతో పాటు అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

