అర్ధాంతరంగా ముగిసిన రైతు దినోత్సవము
అగ్నిధారన్యూస్ (పెద్దపల్లి) రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మక చేపట్టినటువంటి దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు వ్యవసాయ రంగంపై ప్రభుత్వం చేపట్టినటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రభుత్వం రైతులకు చేస్తున్న సహాయం గురించి ప్రజలకు సంబంధిత వ్యవసాయ శాఖ అధికారులు గ్రామ స్పెషల్ ఆఫీసర్ పంచాయతీ కార్యదర్శి గ్రామ సర్పంచ్ గ్రామస్థాయి అన్ని శాఖల అధికారులు పాల్గొన్న రైతు దినోత్సవ వేడుకలలో ఎడ్ల బండితో ప్రచార ర్యాలీలో బండిని టిఆర్ఎస్ జెండాలు కండవలతో నింపారు. ఒక్కసారిగా బిఆర్ఎస్ కండువాలతో కార్యకర్తలు నాయకులు దర్శనం ఇవ్వడంతో కొత్తపల్లి గ్రామ సర్పంచ్ శిలారపు సత్యం ప్రభుత్వ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ కండువాలను వేసుకోవడాన్ని అక్కడున్న ప్రభుత్వ అధికారుల సమక్షంలో నిరసిస్తూ జరుగుతున్న ర్యాలీ నుండి వెళ్లిపోయారు. అనంతరం రైతు వేదికలో జరిగిన కార్యక్రమంలో కలవేనా రాజయ్య అనే రైతు వడ్లు కొనుగోలు విషయంలో జాప్యం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. రైతులకు అన్యాయం జరుగుతుందంటూ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు . రైతులకు మాట్లాడడానికి అవకాశం ఇవ్వలేదంటు కలవేన రాము ఒక సందర్భంగా ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తిస్థాయిలో అధికారులు మాట్లాడకుండానే సమావేశాన్ని అర్ధాంతరంగా ముగించాల్సి వచ్చింది.
